America Vs China Trade War: ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో టారిఫ్‌లను ప్రకటించిన ట్రంప్. చైనాపై 34 శాతం సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34 శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. చైనా నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన ట్రంప్.. ఏప్రిల్ 8లోగా తన నిర్ణయాన్ని డ్రాగన్ వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే, అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు చైనా స్పందించకపోవడంతో.. అదనంగా 50 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. వాణిజ్య భాగస్వామ్య దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు వేసి తమ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలన్నారు. ఈ క్రమంలో ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకం విధించింది. ఇటీవల పెంచిన సుంకంతో కలిపి, చైనాపై మొత్తం సుంకం 54 శాతానికి చేరుకుంది. ఇప్పుడు మరో 50 శాతం పన్నులు పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది. వారం వ్యవధిలోనే చైనాపై మొత్తం సుంకాలు 104 శాతానికి చేరుకున్నాయి.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
కానీ, చైనాకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టిన ట్రంప్.. చైనా కూడా తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని, కానీ దానిని ఎలా ప్రారంభించాలో వారికి తెలియడంలేదన్నారు. వారి పిలుపు కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. అధిక సుంకాలతో తమను బీజింగ్ దోపిడీ చేసిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు, సుంకాలపై తాము చివరి వరకూ పోరాడుతామని ఇదివరకే చైనా ప్రకటించింది.
*
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలను బ్లాక్ మెయిల్‌గా చైనా అభివర్ణించింది. ‘చైనాపై సుంకాలపై అమెరికా తప్పు మీద తప్పు చేస్తోంది. అమెరికా చైనాను తన దారికి తెచ్చుకోవాలని భావిస్తే, దానికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాడుతామంటోంది. ఇలా రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వాణిజ్య యుద్ధానికి దిగడంతో ప్రపంచం అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ మార్కెట్లు అతిపెద్ద పతనాన్ని చవిచూస్తున్నాయి.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









