America Vs India: అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23 యేడాదిలో 2 లక్షల 68 వేల 923 మంది వెళ్తే, 2023–24లో 3 లక్షల 31 వేల 602 మంది యూఎస్ వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెల్స్ ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97వేల556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి భారత్ కు తిరిగి రావాల్సి ఉంటుంది.
అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున మన దేశ కరెన్సీలో రూ. 35 లక్షల నుంచి రూ. 49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో భారత దేశానికి తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
మరోవైపు విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏమేమి ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు.
అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది.
మన దేశం నుంచి అమెరికా వెళ్లి విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై ఆ దేశంలో ఆరా తీసే పనిలో పడ్డారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. మరోవైపు అమెరికలో ఉద్యోగాలు అమెరికన్లకే అనే నినాదం ఊపందుకుంటోంది. దీంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









