)
US Tarrif effects: అగ్రరాజ్యం అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 27వ తేదీ ప్రారంభమయ్యే అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ అదనపు సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆ సమయం తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్‌లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈమేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో పేర్కొంది. భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతోనే అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ భారత్ పై 25 శాతం ఎక్స్ ట్రా టాక్సెస్ విధించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులకు అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో భారత్ అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూఢిల్లీపై మొత్తం సుంకాలు 50శాతానికి పెరిగాయి. ఈ టారిఫ్‌లతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతికొద్ది వస్తువులైన మెడికల్ ఇతర ఎమర్జన్సీ వస్తువలుపై ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది.
ఈ అదనపు సుంకాలపై ఇప్పటికే భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది అనుచితం, అన్యాయం, అహేతుకమని స్పష్టం చేసింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరోవైపు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా దీనిపై స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని.. కానీ దానిని భరిస్తామని స్పష్టం చేశారు.
అమెరికా అదనపు సుంకాలపై నేడు దిల్లీలో కేంద్ర క్యాబినేట్ కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో అమెరికా సుంకాలపై నేడు పీఎం కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ట్రంప్ టారిఫ్‌లు అమల్లోకి రానున్ను నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా పన్నుల నేపథ్యంలో భారత్ ఎగుమతులపై పడే ప్రభావంపై చర్చించే అవకాశం ఉంది. అత్యవసర రుణ పరిమితి హామీ పథకం అందుబాటులోకి తేవాలని కోరిన ఎగుమతిదారులు. దీనిపై క్యాబినేట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు అమెరికా .. భారత దేశం - పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపానన్నారు. నేను ఆపిన అతిపెద్ద యుద్ధం భారత్, పాకిస్థాన్ దే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో అణ్వాయుథాలు వినియోగించే స్థాయికి చేరాయని వెల్లడించారు. ఇరు దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తానని చెప్పడంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గినట్టు చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.