Islamic State commander killed : ISIS పై అమెరికా ఉక్కుపాదం.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ ఖతం..

Islamic State commander killed : అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబూ ఖదీజాను చంపాయని ప్రధాన మంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ తెలిపారు. అతన్ని "ఇరాక్, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులలో ఒకరు" అని అభివర్ణించారు. అమెరికా నేత్రుత్వంలోని సంకీర్ణ దళాల మద్దతుతో ఇరాకీ భద్రతా దళాలు అబు ఖదీజా ను హతమార్చాయని ఇరాక్ ప్రధాని మొహ్మద్ షియా అల్ సుడానీ తెలిపారు.   

Written by - Bhoomi | Last Updated : Mar 15, 2025, 10:42 PM IST
Islamic State commander killed : ISIS పై అమెరికా ఉక్కుపాదం.. ఇస్లామిక్ స్టేట్ లీడర్ ఖతం..

Islamic State commander killed : ఐసీస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇస్లామిక్ స్టేట్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అమెరికా మట్టుబెట్టింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్ లో జరిపిన ఆపరేషన్ లో అతన్ని హతమార్చింది. అబు ఖదీజా, మరోటెర్రరిస్టు వాహనంప వెళ్తుండగా క్షిపణిని ప్రయోగించి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో వైట్ హౌస్ విడుదల చేసింది. ఇదే దాడిలో మరొక ఐసిసి ఉగ్రవాది కూడా హతం అయ్యాడు. ఈనెల 13న ఈ దాడి చేసినట్లు అమెరికా తెలిపింది. 

Add Zee News as a Preferred Source

ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ లాజిస్టిక్స్ ప్రణాళికలు, ఆర్థిక నిర్వహణకు అబు ఖదీజా పర్యవేక్షిస్తాడు. క్షిపణితో దాడి  అనంతరం అబు ఖదీజా మరణించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. ఈ మేరకు అమెరికా ఇరాకీ దళాలు ఘటనాస్థలానికి చేరాయి. ఉగ్రవాదులు ఆత్మాహుతి వెస్ట్స్ ధరించారని పలు ఆయుధాలు కలిగి ఉన్నారని అమెరికా దళాలు వెల్లడించాయి. డీఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించడం ద్వారా మరణించింది అబు ఖదీజానే అని ధ్రువీకరించారు. 

Also Read: Gold vs Stock Market:  బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..భవిష్యత్ లో ఎందులో మంచి రాబడి ఇస్తుంది?  

కాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ కీలక సభ్యుల్లో అబు ఖదీజా ఒకరు. అమెరికా భద్రతకు ముప్పుగా ఉండే ఉగ్రవాదులందరినీ హతమారుస్తామంటూ ఈ సందర్భంగా అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా వెల్లడించారు. అబు ఖదీజా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఉగ్రవాదని ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ అన్నారు. అమెరికాతో కలిసి అబు ఖదీజాను హతమార్చినట్లు సోషల్ మీడియా పోస్టులో అల్ సడానీ పోస్టు  చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News