Donald Trump Effect: భారతీయ గ్రీన్ కార్డు హోల్డర్లకు బిగ్ షాక్, దాడులు నిర్బంధాలతో టెన్షన్

Donald Trump Effect: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడి భారతీయులకు షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లను లక్ష్యంగా చేసుకున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2025, 12:31 PM IST
Donald Trump Effect:  భారతీయ గ్రీన్ కార్డు హోల్డర్లకు బిగ్ షాక్, దాడులు నిర్బంధాలతో టెన్షన్

Donald Trump Effect: అమెరికాలోని గ్రీన్ కార్డుదారుల ఇళ్లపై దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతీయులే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. విమానాశ్రయాల్లో అయితే ఇండియన్ అయితే చాలు బట్టలు విప్పి మరీ తనిఖీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలతో ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

అగ్రరాజ్యం అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అక్కడి భారతీయుల్ని లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటికే అక్రమంగా వలస ఉంటున్నవారిని ప్రత్యేక విమానాల్లో వెనక్కి పంపించేసింది. ఇక ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లను లక్ష్యంగా చేసుకుంది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం ఇవ్వలేమంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు అక్కడి భారతీయుల్లో ఆందోళన రేపుతున్నాయి. భారతీయ సీనియర్ సిటిజన్లును అక్కడి విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. అమెరికా బయట ఎక్కువ కాలం నివసిస్తూ తరచూ ఇండియాకు వెళ్లివచ్చేవారిని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే సీనియర్ సిటిజన్ గ్రీన్ కార్డు హోల్డర్లను ఫారమ్ 1-407పై సంతకం కోసం బలవంతం చేస్తున్నారని ఫ్లోరిడాలోని ఓ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది ఆరోపించారు. 

అమెరికాలో చాలా ప్రాంతాల్లో గ్రీన్ కార్డు కలిగిన సీనియర్ సిటిజన్లను ప్రత్యేకించి భారతీయుల్ని ఫారమ్ 1-407పై సంతకాలు చేయించేందుకు ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడికి లోనుకావద్దని, గ్రీన్ కార్డు అప్పగించవచ్చని సియాటిల్‌కు చెందిన మరో న్యాయవాది సూచిస్తున్నారు. ఎవరైనా ఓ వ్యక్తి స్వచ్ఛందంగా ఫారమ్ 1-407పై సంతకం చేయనంతవరకూ ఆ వ్యక్తి గ్రీన్ కార్డు రద్దు చేయలేరని ఆయన తెలిపారు. అమెరికాలో జరుగుతున్న ఈ పరిణామాలతో గ్రీన్ కార్డు కలిగిన వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ చట్టం ఏం చెబుతోంది

ఈ చట్టం ప్రకారం గ్రీన్ కార్డు ఉన్నా సరే కొన్ని కారణాలతో ఆ కార్డు రద్దు చేసే అధికారం ఆ దేశానికి ఉంది. ఈ కారణాల్లో అతి ముఖ్యమైంది ఏడాదిలో ఎక్కువ కాలం అమెరికా వెలుపల ఉండటం. ఆరు నెలలకు పైగా అమెరికా వెలుపల ఉంటే తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ఏడాదిపాటు గ్రీన్ కార్డు హోదా కోల్పోతారు. అదే సమయంలో జాతీయ భద్రతా సమస్యలు, సంభావ్య ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, వీసా ఉల్లంఘనలు చేసినవారంతా ప్రమాదంలో ఉన్నట్టే. 

అమెరికా ఫస్ట్ నినాదంతో డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలతో భారతీయులు ఎక్కువగా ప్రభావితమౌతున్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డు కలిగినవారిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నారు. అమెరికా ప్రభుత్వం తాజాగా చేపట్టిన తనిఖీలు, నిర్బంధాలతో గ్రీన్ కార్డు కలిగినవారిలో ఆందోళన వ్యక్తమౌతోంది. 

Also read: Telangana Tourism: తెలంగాణలో ప్రైవేటుతో పర్యాటక శోభ, కొత్త టూరిజం పాలసీ , 27 ప్రాంతాల అభివృద్ధి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News