)
american ambassador to india: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో చావు దెబ్బ కొట్టింది. దీంతో పాటు పాకిస్థాన్ లో అమెరికా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అణు స్థావరాలపై భారత్ దాడి చేసినప్పటి నుంచి మనపై గుర్రుగా ఉంది అమెరికా. దీంతో మన దేశం పై కత్తి కట్టింది. అంతేకాదు పాకిస్థాన్, హిందూస్థాన్ ను ఒకే తరహా దేశాలని మనల్ని అవమాన పరిచారు. అంతేకాదు మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీగా సంకెళ్లను విధించి మనపై కసి తీర్చుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మరోసారి అమెరికా.. భారత్ లో తన రాయబారిని మార్చారు.
ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమించడం విశేషం. ప్రస్తుతం ఆయన వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 38 ఏళ్ల సెర్గియో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల అత్యంత విశ్వాస పాత్రుడు. ఈయన అమెరికా కు వినయంగా భారత్ పై విద్దేషం ఉన్న అధికారిగా పేరుంది. చాలా తక్కువ సమయంలోనే అతను ట్రంప్ పరిపాలన విభాగంలోకి చేరారు.
ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు చేశారు. ‘భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ విధులు నిర్వహించనున్నారు. సెర్గియో తనకు గొప్ప స్నేహితుడని... చాలా ఏళ్లుగా తనకు మద్దతుగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం కోసం సెర్గియో ఎంతోకృషి చేశారని పోస్ట్‌లో పేర్కొన్నారు. సెర్గియో గొప్ప రాయబారి అవుతాడని అతడికి తన అభినందనలని ట్రంప్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.