India vs Pakistan: యుద్ధమేఘాలు.. కరాచీ తీరంలోకి టర్కీ యుద్ధనౌక.. ఏ క్షణమైనా భారత్‌ దాడిచేస్తుందని..

 India vs Pakistan war Turkey Warship Video: భారత్ పాక్‌ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కరాచీ తీరంలోకి టర్కీ యుద్ధనౌక కూడా వచ్చేసింది. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ మిత్ర దేశాల నుంచి సాయం కోరుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : May 5, 2025, 07:30 AM IST
India vs Pakistan: యుద్ధమేఘాలు.. కరాచీ తీరంలోకి టర్కీ యుద్ధనౌక.. ఏ క్షణమైనా భారత్‌ దాడిచేస్తుందని..

 India vs Pakistan war Turkey Warship Video: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లో ఒక రకమైన భయం కూడా మొదలైంది. ఇదీ కాక అనేక ఆంక్షలు కూడా పాక్‌పై భారత్ విధించింది. దాయాది దేశం మిత్ర దేశాల సాయం కోరుతోంది. ఈ నేపథ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవటంతో కరాచీ తీరంలో టర్కీ యుద్ధనౌక కూడా వచ్చి చేరింది. తాజాగా టర్కీ చెందిన టీసీజీ బుయికాడ అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరానికి చేరింది. గస్తీ కాయడం, సబ్‌మెరైన్‌లను నాశనం చేయడం ఈ యుద్ధనౌక ప్రత్యేకత. అటు పాకిస్తాన్ కి టర్కీ అక్రమంగా ఆయుధాలను కూడా సరఫరా చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టర్కీ నౌక ఇలా కరాచీ చేరుకోవడం మరింత బలం చేకూరుస్తోంది .

Add Zee News as a Preferred Source

పహాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా దాయాదీ దేశం పాకిస్తాన్.. తన మిత్ర దేశం అయిన టర్కీ సాయం తీసుకుంది. భారత్‌ ఏ క్షణమైన సముద్ర మార్గంలో దాడి జరప వచ్చనే అనుమానంతోనే ఈ టర్కీ నౌకను పాక్‌ రప్పించినట్లు సమాచారం. మరోవైపు మన నావికా దళ నాయకులు కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూనే నావిక విన్యాసాలు కూడా చేపడుతున్న సమయంలో ఇలా పాకిస్తాన్ టర్కీ సాయం కోరింది. 

ఇక కయ్యానికి కాళు దూసిన పాకిస్తాన్ భారత్ ఏ క్షణమైన తమపై విరుచుకుపడవచ్చు అనే భయంతో కూడా ఉంది. ఈ నేపథ్యంలో పీఎం ప్రధానమంత్రి మోదీ కూడా వరుస చర్చలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాధిపతులతో భేటీ కావడం కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా ఆయన ప్రకటించారు. అటు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కూడా మీరు కోరుకున్నది కచ్చితంగా జరుగుతుంది. హామీ ఇస్తున్న అని ప్రకటించడం కూడా గమనార్హం. 

ఇక పహాల్గాం ఉగ్రదాడిలో 27 మంది అమాయక టూరిస్టులను పెట్టుకున్న సంగతి తెలిసిందే. దాయాదీ దేశం అండతో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు టూరిస్ట్ ప్రాంతంలో విరుచుకపడి 27 మంది ప్రాణాలను తీశారు. హిందూ అని చెప్పగానే వాళ్ళని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రగిలిపోతున్న భారత్ ఉగ్రవాదులను వేటాడే ప్రయత్నంలో కూడా తీవ్ర కృషి కూడా చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొన్ని చర్యలు కూడా తీసుకుంది ..
ప్రధానంగా సింధు జలాల ఒప్పందం 1960 మొదటగా రద్దు చేసింది. ఆ తర్వాత అటారీ  వాఘా బార్డర్‌ను కూడా మూసేసింది. పాక్‌ పౌరులకు వీసా కూడా సస్పెండ్ చేసింది. భారత్ గగనతలంలోకి పాక్ విమానాలు రాకుండా ఆంక్షలు కూడా విధించింది. ఇది మాత్రమే కాదు దిగుమతులపై నిషేధం కూడా విధించింది. భారత్ పాక్‌ సినిమాలను ఇండియాలో నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నటుల సోషల్ మీడియా ఖాతాలు కూడా ఇండియాలో బ్లాక్ కూడా అయిపోయాయి. 

 

 

READ ALSO:  నేటి రాశిఫలాలు.. నేడు విజయ ఢంకా మోగించనున్న రాశి ఇదే..  

READ ALSO:  కుదుళ్ల ఆరోగ్యానికి వంటింట్లో ఉండే ఈ 10 వస్తువులను కొబ్బరి నూనెలో కలిపి రాయండి.. 

 ఇదిలా ఉండగా నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్నా నేపథ్యంలో రాజనాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది కచ్చితంగా జరుగుతుందని భరోసా ఇస్తున్న అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం కూడా ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News