Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, క్రూ 10 మిషన్ ఎందుకు ఆగిపోయింది

Sunita Williams: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మరోసారి నిరాశే ఎదురైంది. ఇద్దరినీ క్షేమంగా భూమ్మీదకు తీసుకురావాల్సిన స్పేస్‌ఎక్స్ క్రూ 10 మిషన్ చివరి నిమిషంలో ఆగిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2025, 06:39 PM IST
Sunita Williams: సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, క్రూ 10 మిషన్ ఎందుకు ఆగిపోయింది

Sunita Williams: భారత వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్‌లు అంతరిక్షంలో చిక్కుకుపోయి 9 నెలలవుతోంది. వారం రోజుల్లో తిరిగి వచ్చేయాల్సిన వ్యోమగాములు సాంకేతిక కారణాలతో క్యాప్యూల్స్ ఖాళీగా వచ్చేయడంతో 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు. తాజాగా ఈ ఇద్దరినీ స్పేస్‌ఎక్స్ సహాయంతో తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

Add Zee News as a Preferred Source

నాసాకు చెందిన వ్యోమ నౌక స్టార్ లైనర్ జూన్ 5వ తేదీ 2024న అంతరిక్షానికి బయలుదేరింది. ఈ నౌకలో భారతదేశానికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బచ్ విల్మోర్ ఉన్నారు. వాస్తవానికి ఈ ఇద్దరూ వారం రోజుల్లోనే తిరిగి అదే స్టార్ లైనర్ క్యాప్యూల్‌లో భూమ్మీదకు వచ్చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండా ఖాళీగా తిరిగొచ్చేసింది. అప్పటి నుంచి 9 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయారు. ఈ ఇద్దరినీ భూమ్మీదకు రప్పించేందుకు నాసా ఇప్పుడు స్పేస్‌ఎక్స్‌‌తో కలిపి పనిచేస్తోంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక సిద్ధమైంది. ఈ నౌక కొందరిని అంతరిక్షంలో పంపి తిరిగి వచ్చేటప్పుడు సునీతా విలియమ్సన్, బచ్ విల్మోర్‌లను తీసుకొస్తుంది. క్రూ 10 మిషన్‌కు నాసాకు చెందిన అన్నే మెక్‌క్లెయిన్ నేతృత్వం వహిస్తుండగా నికోల్ అయర్స్ పైలట్‌గా ఉంటాడు. ఇదే మిషన్‌ లో జపాన్ అంతరిక్ష సంస్థకు చెందిన టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్ ఉన్నారు. 

వాస్తవానికి ఈ ప్రయోగం మార్చ్ 25న జరగాల్సి ఉంది. అయితే ప్రీ షెడ్యూల్ చేసి ఇవాళ చేపట్టాలని నిర్ణయించారు. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39 ఏ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం ఆగిపోయింది. తిరిగి రేపు లేదా ఎల్లుండి ప్రయోగం రీ లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. దాంతో సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక మరింత ఆలస్యంగా మారింది.

Also read: Half Day Schools: విద్యార్ధులకు శుభవార్త, ఒంటి పూట బడులు, వేసవి సెలవుల ప్రకటన, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News