Balochistan: బలూచిస్తాన్ అసలు చరిత్ర తెలుసా.. వీరి పోరాటం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందా..!

Balochistan: భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుతం బలూచిస్తాన్ పేరు వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్లు స్వతంత్య్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్నారు. తాజాగా భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ సందర్భంగా బలూచిస్తాన్ ప్రజలు చరిత్ర ఏమిటి.. ? ఎపుడు పాకిస్థాన్ లో కలిసింది. ఎందుకు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. వీరి చరిత్ర విషయానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : May 10, 2025, 04:05 AM IST
Balochistan: బలూచిస్తాన్ అసలు చరిత్ర తెలుసా.. వీరి పోరాటం వెనక ఇంత పెద్ద చరిత్ర ఉందా..!

Balochistan: భారత్ భిక్షతో  పాకిస్థాన్ స్వతంత్య్ర దేశంగా ఆవిర్భించిన తర్వాత కొన్నాళ్లకు బలూచిస్తాన్ పాకిస్థాన్ లో విలీనం అయింది.  అంతకు ముందు శతాబ్ధాలుగా రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరంగా వీరి  పోరాటం కొనసాగుతూనే ఉంది.  ఈ ప్రాంతం ప్రాచీన నాగరికతల నుంచి ఆధునిక రాజకీయ పోరాటాల వరకు అనేక ఘట్టాలను సాక్ష్యంగా నిలిచింది. మొత్తంగా 7 భాగాలుగా విభజించి చూడొచ్చు.

బలూచిస్తాన్ సామాన్య శకం పూర్వం 7000 BCE నుంచి 2500 BCE వరకు మధ్యలో ఇక్కడ ప్రజల వ్యవసాయం, పశుపోషణ చేసినట్టు ఆధారాలు లభించాయి. ఇది హరప్పా నాగరికతకు పశ్చిమ సరిహద్దు ఉంది. అప్పట్లో వాణిజ్య పరంగా కీలకంగా పోషించింది.
 
ఆ తర్వాత సామాన్య శకం పూర్వం 6వ శతాబ్ధం నుంచి 3వ శతాబ్దం మధ్యలో ఆచెమెనిడ్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సామాన్య శకం 303 BCE లో చంద్రగుప్త మౌర్యడి పాలన ఉండేది. ఇక సామాన్య శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్యలో పారతరాజాస్ అనే హిందు రాజులు పాలించారు.

మధ్య యుగంలో ఇస్లామిక్ ప్రభావం (సామాన్య శకం 7వ శతాబ్దం - 15వ శతాబ్దం)

సామాన్య శకం 654లో రషీదున్ ఖలీఫత్ సైన్యాలు బలూచిస్తాన్ లో ప్రవేశించడంతో అక్కడ ఇస్లామ్ ప్రవేశించింది.9వ శతాబ్దంలో ఈ ప్రాంతం సఫారీద్, గజ్నవీ, ఘోరీ సామ్రాజ్యల పాలనలోకి వచ్చింది. గజని పాలటకుడు మహ్మద్ గజని ఈ ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో కలుపుకున్నాడు.

1666 ఖలాత్ ఖానేట్ (1666- 1948)

బ్రహూయి తెగల నేత మీర్ అహ్మద్ ఖాన్ 1666లో ఖలాత్ ఖానేట్ ను ఇక్కడ స్ఠాపించాడు. ఇది మొఘలాయిల సామంతులు ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత ఆఫ్ఘాన్ దుర్రానీ సామ్రాజ్యానికి బానిసగా సేవలు అందించింది. ఇక నాసిర్ ఖాన్ I (1749-1794) కాలంలో ఖలాత్ ఖానేట్ కు ఉచ్చ స్థితికి చేరుకుంది.

బ్రిటిష్ రూల్  & ఖలాత్ విలీనం (1839-1948)

1839లో బ్రిటిస్ సైన్యం ఖలాత్ ను ఆక్రమించుకుంది. 1876 ఖలాత్ ఖాన్ బ్రిటిష్ రాజుకు అనుబంధంగా ఒప్పందం చేసుకున్నారు. 1947లో
భారత,పాకిస్థాన్ విభజన సందర్భంగా ఖలాత్ స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని భావించింది. ఆ తర్వాత బలూచ్ అప్పటి ప్రధాని నెహ్రూను భారత్ లోవ విలీనం చేసుకోవాలని చెప్పినా..   మా దేశానికి సరిహద్దు లేదంటూ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా..1948లో  పాకిస్థాన్ లో విలీనం అయింది.  

స్వతంత్రత పోరాటాలు.. తిరుగుబాట్లు.. (1948 నుంచి ఇప్పటి వరకు)

పాకిస్థాన్ లో విలీనం అయినప్పటి నుంచి ఈ ప్రాంతం ప్రజలను సెకండ్ గ్రేడ్ పౌరులుగా పరగణించారు. సైన్యం, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్లపై వివక్ష చూపించేవారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. ముఖ్యంగా విలీనం అయిన మొదటి యేడాదిలో ఖాన్ ఆఫ్ ఖలాత్ సోదరుడు అబ్ధుల్ కరీం తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇక 1958 -59 నుంచి నవాబ్ నౌరోజ్ ఖాన్ లో మరో తిరుగుబాటు మొదలైంది. ఆ తర్వాత 1963 -69 మధ్య షే్ మహ్మద్ బిజ్రాని మార్రీ నేతృత్వంలో గెరిల్లా యుద్ధం జరిగింది. 1973- 77 మధ్య బలూచిస్తాన్ పీపుల్స్ లతిబరేషన్ ఫ్రంట్ (BPLF) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ముఖ్యంగా తమ అస్తిత్వం, వనరులపై నియంత్రణ, రాజకీయ హక్కుల హరణం, సాంస్కృతిక పోరాటం కోసం ఈ పోరాటం జరగుతూనే ఉంది.

నేటి బలూచిస్తాన్ --సవాళ్లు.. అవకాశాలు..

బలూచిస్తాన్ పాకిస్థాన్ లో అతిపెద్ద ప్రావిన్స్. ఎన్నో సహజ వనరులకు నిలయం. అయిన అక్కడి వనరులను వాళ్లకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం అక్కడ అభివృద్దిని అసలు పట్టించుకోకపోవడం వంటికి అక్కడ తిరుగుబాటుకు కారణమయ్యాయి. ముఖ్యంగా చైనా - పాకిస్థాన్ ఆర్ధిక కారిడార్ (CPEC) ప్రాజెక్ట్ ద్వారా గ్వాదర్ పోర్ట్ అభివృద్ది జరుగుతోంది. అయితే స్థానికులకు ఎలాంటి లాభం లేకపోవడం.. అక్కడ ఉద్యోగాల్లో పంజాబ్, చైనాకు చెందిన వాళ్లకే లభించాయి. దీంతో తిరుగుబాటు చేస్తూ తమ గుర్తింపు, అస్తిస్తత్వం , హక్కుల కోసం పోరాడుతూ తాజాగా స్వతంత్రం ప్రకటించుకోవడం విశేషం.  

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News