Baloochistan:కొరివితో తల గొక్కోవడం అంటే పాకిస్థాన్ ను చూస్తే తెలుస్తోంది. తెలిసి తెలిసి పాకిస్థాన్ ప్రభుత్వ ఆర్మీ.. తన కనుసన్నల్లో జమ్మూ కశ్మీర్ లో పహల్గామ్ లో ఉగ్రదాడి చేయించింది. అది కూడా మతం పేరు చెప్పి మరి మన దేశ పౌరులను కాల్చి చంపింది. ఈ నేపథ్యంలో మన దేశం అదును చూసి పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలను కూల్చేసింది. ఈ దాడిలో దాదాపు కొన్ని వేల మంది చనిపోయినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అంతేకాదు సుశిక్షితులైన ఉగ్రవాదులు ఈ దాడిలో మృతి చెందారు. అంతేకాదు ఈ దాడిలో మసూద్ అజహర్ కుటుంబానికి చెందిన పలువురు ఈ దాడిలో కుక్క చావు చచ్చారు. ఓ వైపు భారత్.. పాకిస్థాన్ ను ఆపరేషన్ సిందూర్ తో ఉక్కిరి బిక్కిరి చేయడంతో పాటు పాక్ చెందిన కీలకమైన వైమానిక స్థావరాలను కూల్చేసింది. అంతేకాదు అణు స్థావరాలు ఈ దాడిలో పనికిరాకుండా పోయినట్టు సమాచారం.
ఆ సంగతి పక్కన పెడితే.. పాకిస్థాన్ కు సొంత ఇంట్లో బలూచ్ వాళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరోసారి పాకిస్థాన్ ఆర్మీకి బలూచ్ స్వాతంత్య్ర వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. కరాజీ క్వెట్టా హైవేపై కీక నగరమైన సెరబ్ సిటీని BLA స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం సురబ్ సిటీలోని ప్రభత్వ కార్యాలయాలపై బలూచిస్థాన్ జెండాలు దర్శమిస్తున్నాయి.
ఈ క్రమంలో అక్కడున్న పాకిస్తాన్ సైన్యాన్ని BLA దళాలు తరిమికొడుతున్నాయి. దీంతో బలూచిస్తాన్ ప్రాంతంపై పాకిస్థాన్ పట్టుకోల్పోతంది. దాదాపు 80 శాతం ప్రాంతాలు BLA ఆధీనంలోకి వెళ్ళాయి. మొన్న క్వెట్టా ను కోల్పోయిన పాకిస్తాన్ తాజాగా సురబ్ సిటీని విడిచి సైన్యం పారిపోయింది. కాగా BLA వరస దాడులతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజా దాడుల్లో 3 వందల మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









