)
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై నమోదైన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఈరోజు తన తుది తీర్పును ప్రకటించనుంది. ఈ నేపథ్యంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా రాజధాని ఢాకా సహా కొన్ని ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు కొనసాగుతుండడంతో భద్రతా దళాలు భారీగా మోహరించారు. అల్లర్లు నియంత్రణలో లేకపోతే కాల్పులు జరపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
78 ఏళ్ల షేక్ హసీనా.. ఆమె మాజీ హోం మంత్రి అసద్-ఉజ్-జమాన్ ఖాన్ కమల్, అప్పటి ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌లపై గత సంవత్సరం జరిగిన ప్రభుత్వం వ్యతిరేక ఆందోళనల సమయంలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసు ప్రకారం హత్య, హత్యాయత్నం, హింస, పౌరులపై అమానవీయ చర్యలకు వారు బాధ్యులని ట్రిబ్యునల్‌కు సమర్పించిన పత్రాలలో పేర్కొన్నారు. అంతేకాకుండా విచారణ మొత్తం షేక్ హసీనా హజరుకాకుండానే జరిగింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ప్రవాసంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ స్పష్టమైన డిమాండ్ చేసింది.
విచారణ తీర్పు వెలువడిన తర్వాత 30 రోజులలోపు ఆమె స్వచ్ఛందంగా లొంగిపోవాలి లేదా అరెస్ట్ కావాలి. అలా జరగకపోతే సుప్రీం అప్పీలేట్ డివిజన్లో తీర్పును సవాలు చేసే హక్కు కూడా ఆమెకు ఉండదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రాసిక్యూషన్ న్యాయవాదులు ఆమె ఆస్తులను స్వాధీనపరచాలని, నిరసనల సమయంలో మరణించిన లేదా గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం అందించాలని ట్రిబ్యునల్‌ను కోరారు.
తీర్పు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తనపై ఉన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, రాజకీయ ప్రేరణతో నిండి ఉన్నవని ఆమె అన్నారు. మా మీద ఇలాంటి దాడులు, కేసులు కొత్తవి కావు. నేను నా దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాను. అల్లా ఇచ్చిన ఈ జీవితాన్ని చివరి వరకు ప్రజల సేవలోనే ఉపయోగిస్తాను అని హసీనా పేర్కొన్నారు.
ఢాకాలో తనను ప్రభుత్వాధికారంలోనుంచి బలవంతంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె విమర్శించారు. ఎన్నికైన ప్రతినిధులను బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే వారిని శిక్షించాల్సిందే అని మా రాజ్యాంగం చెబుతోంది. నా మీద తప్పుడు కేసులు పెట్టిన వారిపై ఒకరోజు జరిగేది జరుగుతుంది. అని హసీనా తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని, పరిస్థితులు ఏ విధంగైనా మారినా తాను చివరి వరకు పోరాడుతానని సందేశం ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook