Bangladesh New Currency Note: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేసింది. బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు, మాజీ ప్రధాన మంత్రి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని కొత్త కరెన్సీ నోట్ల నుండి తొలగించారు. ఇప్పుడు వాటి స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై షేక్ ముజిబుర్ రెహమాన్ కు బదులుగా హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలను ముద్రించారు. షేక్ ముజిబుర్ రెహమాన్ పదవీచ్యుత ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి కూడా. ఆయన చిత్రం బంగ్లాదేశ్ కరెన్సీ నోట్లన్నింటిపై ముద్రించి ఉంటుంది. గత సంవత్సరం, బంగ్లాదేశ్ బ్యాంక్ కొత్త కరెన్సీ నోట్లను జారీ చేయడంపై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్త నోట్ల జారీ షురూ అయ్యింది.
కొత్త డిజైన్, సిరీస్ ప్రకారం..కరెన్సీ నోట్లపై మానవ చిత్రాలు కనిపించవు. వీటిని బదులుగా ప్రక్రుతి ప్రాచుర్యం పొందిన ప్రదేశాలు ఉంటాయని బంగ్లాదేశ్ బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. చారిత్రక ప్రదేశాలతోపాటు హిందూ, బౌద్ధ దేవాలయాల చిత్రాలు ఉంటాయని తెలిపారు. దివంగత చిత్రకారుడు జైనుల్ అబెదిన్ గీసిన కళాఖండాలు కూడా ఉన్నాయని తెలిపారు. మొత్తంగా 9 డిజైన్లు రూపొందించారు. జూన్ 1వ తేదీ నుంచి ఈ నోట్లను విడుదల చేసినట్లు తెలిపారు.
Also Read: Heavy Rains: నైరుతి ఋతు పవనాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు..
తూర్పు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ గా పేరు మార్చుకున్న తర్వాత 1972లో కరెన్సీ నోట్లపై ఓ మ్యాప్ ను కూడా ముద్రించారు. అనంతరం షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రంతో కూడిన నోట్లను విడుదల చేశాడు. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లి పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆమె తండ్రి ఫొటో ఉన్న కరెన్సీ నోట్లను కొనసాగించారు. తాజాగా ఆయన స్థానంలో ఈ కొత్త వాటిని విడుదల చేశారు.
Also Read: Govt Employee Retirement Age: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు.. ఎంతంటే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









