Nikhil Chaudhary: విదేశాల్లో బిగ్‌బాష్‌తో పేరుపొందిన భారత సంతతి క్రికెటర్‌ నిఖిల్‌ చౌదరి వివాదంలో చిక్కుకున్నాడు. అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిఖిల్‌ ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటున్నాడు. మూడేళ్ల నుంచి తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నా కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని నిఖిల్‌ చెప్పుకొస్తున్నాడు. మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందని వాదిస్తున్నాడు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: RCB Vs PBKS: విరాట్‌ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీకి తొలి విజయం.. ఉత్కంఠ పోరులో పంజాబ్‌ ఓటమి


భారత సంతతికి చెందిన నిఖిల్‌ చౌదరి ఆస్ట్రేలియాలో క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అక్కడ ప్రతిష్టాత్మక బిగ్‌బాష్‌ లీగ్‌లో క్రికెటర్‌గా పాల్గొంటున్నాడు. ఆ లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిఖిల్‌పై మూడేళ్ల కిందట అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2021 మే నెలలో ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే నైట్‌ క్లబ్‌లో నిఖిల్‌ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నోటీసులు అందుకున్న నిఖిల్‌ టౌన్స్‌విల్లే జిల్లా కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. తాజాగా కోర్టులో వాదనలు జరిగాయి. కోర్టులో తీవ్ర వాదోపవాదనలు జరగ్గా మహిళ తరఫు న్యాయవాది బలంగా వాదించాడు.

Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా


 


'తన కారులో నిఖిల్‌ ఆమెను రేప్‌ చేశాడు. అఘాయిత్యం చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది' అని మహిళ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఇక బాధితురాలి తల్లి కూడా కోర్టులో తన అత్యాచారం విషయమై తీవ్రంగా విలపించింది. వారి వాదనలను నిఖిల్‌ వర్గం తిప్పికొట్టింది. 'నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా మహిళ తప్పుడు కేసు పెట్టింది. ఆ కేసు కూడా నిలబడలేదు' అని నిఖిల్‌ తరఫు న్యాయవాది వాదించాడు. ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతోంది. తుది తీర్పు వెలువడడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో నిఖిల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్‌ హరికేన్‌ యాజమాన్యం పునరాలోచనలో పడింది. కాంట్రాక్ట్‌ కొనసాగించడంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook