Earthquake: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?

Biggest Earthquake in World: మయన్మార్, బ్యాంకాక్ లో భూకంపం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 7.7 రిక్టర్ స్కేల్ పై నమోదు కావడంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవిస్తుంది తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Mar 30, 2025, 08:40 AM IST
Earthquake: ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఎక్కడ సంభవిస్తుంది? దాని వినాశనం ఎలా ఉంటుంది తెలుసా?

Biggest Earthquake in World: ఉన్నట్టుండి ఒక రాత్రికి రాత్రి మీరు ఉన్న ప్రదేశంలో భూమి పగుళ్లు ఏర్పడి, ఎత్తైన భవనాలు సైతం నేలకూలిపోతే ఎలా ఉంటుంది ?మీరు ఎప్పుడైనా చూశారా? చూడబోతున్నారా? నిన్న, మొన్న మాయన్మార్, బ్యాంకాక్‌ దేశాలు ఇదే విపత్తును కళ్లారా చూశాయి. ఉన్నట్టువంటి భూమి ఒక్కసారిగా కంపించిపోయి.. పెద్ద భవంతులు నేల కూలిపోవడంతో ఒక్కసారిగా ప్రజలంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని రోడ్లపైకి వచ్చారు. అంతేకాదు అతిపెద్ద బిల్డింగులు ఒకసారి కుప్పకూలడంతో రోడ్డుపై వెళ్తున్న వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పెద్ద పెద్ద ఆసుపత్రిలో కూడా నేలకూలాయి. ఈనేపథ్యంలో శిథిలాల కింద కొన్ని వందల మంది చిక్కుకున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం సంభవించనుంది.

Add Zee News as a Preferred Source

అయితే 1960లో చిలీ దేశంలోని వాల్డివియాలో ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం సంభవించింది. రిక్టారు స్కూలుపై 9.6 గా నమోదయింది. ఈ భూకంపం ధాటికి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 6000 మంది వరకు మృతి చెంది ఉంటారని తెలుస్తోంది. పది నిమిషాల పాటు ఈ భూకంపం సంభవించింది. దీనివల్ల సునామి కూడా ఏర్పడింది. హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా ప్రభావితం అయ్యాయి.

ఇక మరో భూకంపం హిందూ సముద్రంలో సంభవించింది. 2004 డిసెంబర్ 26లో భారతీయులు ఆ చుట్టు ప్రాంతాలు తప్పకుండా జీవితంలో మర్చిపోలేనిది. ఈ అలల వల్ల సునామి ఏర్పడి రెండు లక్షల మందికి పైగా ప్రభావం చెందారు. రిక్టారు స్కేల్ పై 9.2 నుంచి 9.3 గా నమోదయింది. ఆ తర్వాత 2011 మార్చిలోనే జపాన్లో మరో భూకంపం వచ్చింది. ఫుకుషీమా అణువిద్యుత్‌ ప్లాంట్లో ఈ ఘటన జరిగింది 9.1 రిక్టార్ స్కేల్ పై నమోదయింది. 

ఇదీ చదవండి : Prabhas PRO: హీరో ప్రభాస్‌  పీఆర్ఓ పేరిట వార్నింగ్‌.. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు..  

అయితే, హాలీవుడ్‌ 'ది నెక్ట్స్‌ బిగ్‌ వన్‌' మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతుందని చెప్పారు. అయితే వాస్తవానికి ఇది ఉత్తరాన ఉన్న ఫాల్స్ లైన్ నుంచి వస్తుందని అనుమానిస్తున్నారు. ఈ భూకంప ప్రభావం 9.2 రిక్టారు స్కేలుపై నమోదయ్యే అవకాశం ఉంది. దీని అలల ధాటికి వాషింగ్టన్‌లోని కొన్ని నగరాలు మొత్తం మునిగిపోతాయని అంచనా వేస్తున్నారు. అయితే, హిమాలయాల్లో ఏర్పడే భూకంపం మరింత వినాశనాన్ని చవిచూస్తారని చెబుతోంది. దీనివల్ల ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుందట.

ఇదీ చదవండి : Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే వేసవిసెలవులు ప్రారంభం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News