close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ప్రపంచ ధన రాజుగా ''అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ " ; టాప్ 100 లో నలుగురు భారతీయులు

బ్లూంబర్గ్ సంస్ధ  విడుదల  ప్రపంచ కుబేరుల జాబితాలో నలుగురు భారతీయులకు చోటు దక్కింది  

Updated: Jul 18, 2019, 05:51 PM IST
ప్రపంచ ధన రాజుగా ''అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ " ; టాప్ 100 లో నలుగురు భారతీయులు

ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ కుబేరుల జాబితాను బ్లూంబర్గ్ సంస్ధ  విడుదల చేసింది. ఈ జాబితాను పరిశీలించినట్లయితే 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు. ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 108 బిలియన్ డాలర్ల ఆస్తులతో  ద్వితీయ స్థానంలోకి నిలిచారు. బిల్ గేట్స్ 107 బిలియన్ డాలర్లుతో మూడో స్థానంలో నిలిచినట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. కాగా యూఎస్ కు చెందిన  డైవర్సిఫైడ్ దిగ్గజం వారెన్ బఫ్ఫెట్   81.9 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గోస్థానంలో నిలువగా యూఎస్ కు చెందిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌ బర్గ్  78.7 బిలియన్ డాలర్ల సంపదతో ఐదో స్థానంలో నిలిచాడు. కాగా టాప్ 10 బిలినీయర్ల జాబితాలో భారతీయులకు ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.

టాప్ 100లో నలుగురు భారతీయలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీయర్ల జాబితాలో నలుగురు భారత కుబేరులకే మాత్రమే స్థానం దక్కంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరుల జాబితాలో 13వ స్థానంలో అంబానీ ఉన్నారు.  అజీమ్ ప్రేమ్ జీది 48వ ర్యాంకు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ చీఫ్ శివ నాడార్‌ 91వ స్థానంలో, కోటక్‌ మహీంద్రా ఎండీ ఉదయ్‌ కోటక్ 94వ స్థానంలో ఉన్నారని బ్లూంబర్గ్ పేర్కొంది. గతంలో కంటే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ లో 10లో ముఖ్యంగా బిల్ గేట్స్ రెండో స్థానం నుంచి మూడో స్థానికి పడిపోయారు.

ఆస్తులు తగిరినా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్
తన భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత, భారీగా భరణం చెల్లించినా, బెజోస్ 125 బిలియన్ డాలర్ల ఆస్తులతో అగ్ర స్థానంలోనే ఉన్నారు. ఆయన భార్య 40.3 బిలియన్ డాలర్లతో మహిళా ధనవంతుల జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా మొత్తంగా చూస్తే ఆమె 22వ స్థానంలో ఉన్నారు. 

మూడో స్థానికి పడిపోయిన గేట్స్
ఇక గేట్స్ విషయానికి వస్తే తన సంపదలోని 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్ కు విరాళం ఇవ్వగా ఆయన ఆస్తి తగ్గిపోయింది. ఫలితంగా రెండో స్థానంలో ఉన్న గేట్స్ మూడో స్థానికి దిగజారిపోయాడు. సమాజ సేవకు ప్రాధాన్యత మిస్తున్న ప్రపంపంచ నలుమూలల నుంచి ప్రసంశలు అందుకుంటున్నాడు. 

 

వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితా ఇదే:
1 జెఫ్ బెజోస్    ( యునైటెడ్ స్టేట్స్,  టెక్నాలజీ)           : 124 బిలియన్ డాలర్లు
2 బెర్నార్డ్ ఆర్నాల్ట్  ( ఫ్రాన్స్, కన్స్యూమర్)                    : 108 బిలియన్ డాలర్లు
3 బిల్ గేట్స్    (యునైటెడ్ స్టేట్స్, టెక్నాలజీ)              : 107  బిలియన్ డాలర్లు
4 వారెన్ బఫ్ఫెట్ ( యునైటెడ్ స్టేట్స్,  డైవర్సిఫైడ్  )    :  81.9 బిలియన్ డాలర్లు
5 మార్క్ జుకర్‌బర్గ్  (యునైటెడ్ స్టేట్స్ , టెక్నాలజీ)     : 78.7 బిలియన్ డాలర్లు
6 అమాన్సియో  ( స్పెయిన్ , రిటైల్ )                            : 66.2 బిలియన్ డాలర్లు
7 లారీ ఎల్లిసన్  (  యునైటెడ్ స్టేట్స్, టెక్నాలజీ )        : 61.3 బిలియన్ డాలర్లు
8 కార్లోస్ స్లిమ్  (  మెక్సికో,  డైవర్సిఫైడ్   )                      :  57.2 బిలియన్ డాలర్లు
9 ఫ్రాంకోయిస్  ( ఫ్రాన్స్,  కన్స్యూమర్  )                        :  56.4  బిలియన్ డాలర్లు
10 లారీ పేజ్     (యునైటెడ్ స్టేట్స్ టెక్నాలజీ )           :  56.3 బిలియన్ డాలర్లు