Employees 36 Hour Holiday: ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారికి ప్రత్యేకంగా సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉన్నఫలంగా సెలవు ప్రకటించడంపై ఉద్యోగ, కార్మిక వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక సెలవు ఎందుకో తెలిస్తే మాత్రం షాకవడం మీవంతు అవుతుంది. 36 గంటల పాటు సెలవు ఇవ్వడం మరింత గమనార్హంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
జపాన్‌లోని టోక్యో నగర పాలక ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతోపాటు నగరంలో జనాభా సంఖ్య తగ్గిపోతుండడంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. జననాల రేటు తగ్గిపోతుండడంతో ఏం చేయాల? అని ఆలోచిస్తూనే క్రమంలో ఓ ఆలోచనకు వచ్చింది. దంపతులు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా వారానికి 36 గంటల సెలవులు ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. సంతానం కనడం కోసం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ సెలవులు ఇవ్వనుండడం విశేషం.
Also Read: Telugu Hero: హీరోయిన్‌ను గర్భవతిని చేసి మోసానికి పాల్పడ్డ 'తెలుగు స్టార్ హీరో'
జపాన్‌లో జననాల రేటు భారీగా తగ్గిపోతోంది. ముందే చిన్న దేశం.. పైగా ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానానికి అడ్డాగా నిలుస్తుంది. ప్రపంచ టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్‌కు జనాభా సమస్య ఎదురవుతోంది. జనాభా తక్కువ ఉండడంతో ఆ దేశం సంతానోత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా దంపతులు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా వారానికి 36 గంటల సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లల్ని కనడం కోసం ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ సెలవులు ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.
ఒక్క సెలవు ఇవ్వడమే కాకుండా దేశంలో జననాల రేటు తగ్గడానికి గల కారణాలు అన్వేషిస్తోంది. దంపతుల ప్రాధాన్యాలు మారడం.. సంస్కృతి వంటి కారణాలతో సంతానోత్పత్తి తగ్గుతోందని గుర్తించింది. చాలామంది యువకుల ఆర్థికంగా వెనుకబడడం.. పిల్లల సంరక్షణకు మద్దతు లేకపోవడం, వర్కింగ్ టార్గెట్స్ చేయడం.. తల్లిదండ్రులుగా మారేందుకు భయపడి సంతానోత్పత్తి ఆలోచనలను అక్కడి ప్రజలు విరమించుకుంటున్నారు.
Also Read: House Rent High: బాత్రూమ్‌ను ఇల్లుగా మార్చుకున్న యువతి.. లోపలికి వెళ్లి చూస్తే..!
జనాభా తగ్గుదలకు కారణాలను గుర్తించిన జపాన్ ప్రభుత్వం నాలుగు రోజుల పని దినాలు ఉండాలని నిర్ణయించింది. పని భారం నుంచి ప్రజలకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలని భావించింది. దంపతులు ఏకాంతంగా ఉండేందుకు.. శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చని ఈ నాలుగు రోజుల పనిదినం నిబంధన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జపాన్ దశాబ్దాలుగా జనాభా రేటు తగ్గుదల భారీగా ఉంది. ఇప్పటికే తొమ్మిది మిలియన్ ఇళ్లు జనం లేక ఖాళీ అయిపోగా.. బర్త్ రేట్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ క్రమంలోనే టోక్యో నగరం వారానికి నాలుగు రోజుల పనిదినాలను అమలు చేసింది. మిగతా రోజుల్లో పిల్లల్ని కనేందుకు సమయం కేటాయిస్తారని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వృద్ధాప్య జనాభా జపాన్‌కు పెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో జపాన్ ఒకటి కాగా.. శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతున్న దేశాల్లో ముందుంది. దీంతో తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహ కాలు, రాయితీతో కూడిన పిల్లల సంరక్షణ, పెళ్లి చేసుకుంటే కానుకలు వంటి విధానాలు జపాన్ ప్రభుత్వం అమలుచేస్తోంది. వాటితోపాటు తాజాగా తీసుకువచ్చిన సరికొత్త విధానంతో ఇకనైన సంతానోత్పత్తి పెరుగుతుందని జపాన్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









