Trump Tariff: ట్రంప్ టారిఫ్ బాంబు.. అమెరికాలో భారీగా పెరగనున్న విదేశీ కార్ల ధరలు

Trump Tariff: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటన్న నిర్ణయాలు ప్రపంచ దేశాలతో పాటు స్వంత దేశ ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ట్రంప్ పలు దేశాలపై ప్రతికూర సుంకాలు పెంచడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. అంతేకాదు అమెరికాలో సైత్యం నిత్యవసర ధరలు భారీగా పెరిగిపోతుండటంతో అమెరికాలో మాంద్యం తప్పదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు అమెరికన్లపై భారీగా ప్రభావం చూపనుంది. తమ దేశంలో తయారు కాని కార్లపై 25శాతం సుంకాన్ని విధిస్తుందని ట్రంప్ అన్నారు. అమెరికాలో తయారైన కారుకు మాత్రం ఎలాంటి సుంకం విధించమని స్పష్టం చేశారు.   

Written by - Bhoomi | Last Updated : Mar 27, 2025, 06:46 AM IST
Trump Tariff:  ట్రంప్ టారిఫ్ బాంబు.. అమెరికాలో భారీగా పెరగనున్న విదేశీ కార్ల ధరలు

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు దిగుమతి చేసుకునే అన్ని విదేశీ కార్లపై 25శాతం సుంకం విధించున్నట్లు ప్రకటించారు.  ఈ సుంకాల నిర్ణయం శాశ్వతమని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. తమ దేశంలో తయారు కాని అన్ని కార్లపై అమెరికా 25శాతం సుంకాన్ని సమర్థవంతంగా విధిస్తుందని ట్రంప్ తెలిపారు. కానీ అమెరికాలో తయారు చేసిన కారుపై ఎలాంటి సుంకం లేదని స్పష్టం చేశారు. 

Add Zee News as a Preferred Source

ఈ కొత్త దిగుమతి సుంకం విధించే నిర్ణయం ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. దాని పునరుద్ధరణ ఏప్రిల్ 3నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై 25శతం సుంకం విధించబోతున్నామని ఓవల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ తెలిపారు. ఈ విధానం దేశీయ తయారీని మరింత ప్రోత్సహిస్తుందని అమెరికాలో కార్లు తయారు అయితే వాటిపై ఎలాంటి సుంకం ఉండదని ఆయన తెలిపారు. 

ఈ చర్యలో ఆటోమేకర్ల సరఫరా గొలుసును దెబ్బతీస్తుందని అమెరికన్ వినియోగదారులు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొవల్సి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య అసమతుల్యతను తగ్గించేందుకు, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు ట్రంప్ పరిపాలన పలు చర్యలను పరిశీలిస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. అయితే ఇలాంటిసుంకాలు ప్రపంచ వాణిజ్య సంబంధాలలో ఉద్రిక్తతలను పెంచుతాయి. ట్రంప్ త్వరలో ప్రధాన వాణిజ్య సంబంధిత చర్యలను ఆవిష్యరించబోతున్నారనేది గమనార్హం. ఆయన ఏప్రిల్ 2ను విముక్తి దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజున ట్రంప్ అనేక కొత్త సుంకాలని విధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Kamindu Mendis SRH 2025: దటీజ్ కమిందు.. రెండు చేతుల్తో ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం అతనికే సాధ్యం  

ఈ నిర్ణయంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పాత్రపై కొనసాగుతున్న ఊహాగానాల మధ్య, ఆటో టారిఫ్ విధానాన్ని రూపొందించడంలో మస్క్ ప్రమేయం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఆటో టారిఫ్‌లపై మస్క్ ఎలాంటి సలహా ఇవ్వలేదని ట్రంప్ అన్నారు. మస్క్ ఎప్పుడూ నన్ను ఎలాంటి సహాయం అడగలేదని కూడా తెలిపారు. ట్రంప్ కూడా ఈ విధానాన్ని ప్రధాన ఆటో తయారీదారులతో చర్చించానని, సుంకాలు మొత్తం మీద సమతుల్యంగా ఉంటాయని లేదా టెస్లాకు ప్రయోజనకరంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు.చైనా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌పై ఒప్పందం కుదుర్చుకోవడానికి చైనాకు స్వల్పమైన టారిఫ్ రాయితీని అందించవచ్చని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అవసరమైతే, ఒప్పందం  కాలపరిమితిని పొడిగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అన్నారు.

Also Read: IPL 2025: నువ్వు నిజంగా లెజెండ్ బ్రో.. ఏకంగా బుమ్రా రికార్డు బ్రేక్ చేసిన రషీద్  

టిక్‌టాక్ విషయంలో, చైనా కొంత పాత్ర పోషించాల్సి ఉంటుంది. బహుశా ఆంక్షల రూపంలో వారు అలా చేస్తారని నేను భావిస్తున్నాను" అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ట్రంప్ మాట్లాడుతూ, టిక్‌టాక్ కొనడానికి అనేక మార్గాలు ఉన్నాయని, టిక్‌టాక్ పట్ల చాలా ఆసక్తి ఉందని అన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News