)
K Visa Benefits In China: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్యాలెంటెడ్ ప్రొఫెషనల్ ఆకర్షించేందుకు చైనా కొత్త వ్యూహం వేసింది. ఒకవైపు అమెరికా H-1B వీసా వర్క్ రేటు పెంచుతూ అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చైనా తాజాగా K వీసాను ప్రవేశపెట్టింది. ఇది కూడా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాల్లో స్కిల్డ్ మాన్ ఫోర్స్ కోసం అక్టోబర్ 1 నుంచి వీసాను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. నిపుణులు దీన్ని H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు. వీసా ఫీజు లక్ష డాలర్లు పెంచిన సంగతి తెలిసిందే. ఇది చైనాకు భారీగా కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కిల్ ఇంజనీరింగ్ నిపుణుల ఆకర్షణ దిశగా చైనా ఆదివారం ఈ ప్రకటన చేసింది. ఇది ఆగస్టులోనే ఆమోదించింది 2025 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇతర దేశాలు తమ వర్క్ వీసాను కఠినతరం చేస్తున్న ఈ సమయంలో చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికా వర్క్ వీసా పై లక్ష డాలర్ల ఫీజు విధించడంతో ప్రధానంగా భారత ఐటీ కంపెనీలో ఆందోళన నెలకొంది.
K వీసాకు ఎవరు అర్హులు?..
చైనా ప్రకారం కే వీసా చైనా లేదా విదేశాల ఉన్న ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో STEM సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ అంతకంటే ఎక్కువ డిగ్రీ పొందిన వారు అర్హులు. ఈ K వీసాకు దరఖాస్తు చేసుకున్నవారు చైనా నియమాలకు లోబడే ఉండాలి. విద్యార్హతలతో సహా డాక్యుమెంటేషన్ అందించాల్సి ఉంటుంది.
K వీసా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మల్టీ ఎంట్రీ, ఎక్కువ కాలం చైనాలో ఉండే అవకాశం ఉంటుంది. ఈ వర్క్ వీసాలకు చైనీస్ సంస్థల యజమానుల కాల్ లెటర్ కూడా అవసరం లేదు. K వీసాదారులు అక్కడ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. గత కొంతకాలంగా చైనీస్ గతంలో కంటే కొన్ని నిబంధనలను సడలించింది. ఇప్పటికే 50 దేశాల నుంచి వచ్చేవారు 240 గంటల వీసా రహిత ప్రయాణం కూడా చేస్తున్నారు. అమెరికా H-1B వీసాకు పోటీగా వచ్చిన ఈ K వీసా ప్రధానంగా భారతీయులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ప్రక్రియ ఎంతో సులభతరంగా కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook