కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పటికే మూడు వేల మరణాలు సంభవించాయి.

Last Updated : Mar 6, 2020, 01:35 PM IST
కరోనా కలకలం.. రంగంలోకి దిగిన గూగుల్, యాపిల్

శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) కు సంబంధించిన విషయాలపై సెర్చింజిన్ గూగుల్, యాపిక్ ఫోకస్ చేస్తున్నాయి. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేస్తున్న  COVID-19కు సబంధించిన యాప్స్‌ను తమ యాప్ స్టోర్ నుంచి డిలీట్ చేసేందుకు నిర్ణయించాయి. గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల వివరాలకు సంబంధించిన యాప్స్ ను మాత్రమే ఉంచి, మిగతా యాప్స్ అందిస్తున్న డేటాను కస్టమర్లకు అందుబాటులో లేకుండా చేసే దిశగా యాపిల్, గూగుల్ ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

కరోనా వైరస్‌ల పేరుతో ప్లే స్టోర్లలో అందుబాటులో ఉండే డేటా వల్ల యాప్ యూజర్లు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు లేని సంస్థలు అందిస్తున్న కరోనా వైరస్ సమాచారాన్ని తొలగిస్తున్నారు. యాపిల్ యాప్ స్టోర్‌లో COVID 19 పేరుతో టైప్ చేస్తే ‘వైరస్ ట్రాకర్’ అని వస్తోంది. దీన్ని హెల్త్ లింక్డ్ అనే యాప్ వస్తుంది. ఇది డబ్ల్యూహెచ్ఓ సంస్థ అందించే కరోనా పాజిటీవ్ కేసుల వివరాలను అందిస్తోంది.

 రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

గూగుల్ ప్లేలో సెర్చ్ చేస్తే ‘Coronavirus: Stay informed’ పేరుతో ఉన్న వెబ్ సైట్‌లో సీడీసీ, రెడ్ క్రాస్, ట్విట్టర్ సంస్థలు అందించే సమాచారం కనిపిస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్ సైతం కరోనా వైరస్‌లకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారంపై ఫోకస్ చేస్తున్నాయి. కాగా, భారత్‌లో కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి.

బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా? 

అట్టహాసంగా రక్షిత 9 రోజుల పెళ్లి వేడుక.. ఫొటో గ్యాలరీ

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News