Donald Trump Zelensky Verbal Clash Video: అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో తీవ్రవాగ్వాదం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీపై ట్రంప్, వాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఆ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ అధ్యక్షుడు అమెరికా పర్యటనలో ఉన్నారు.. ప్రధానంగా ఆయన ఖనిజాల ఒప్పందం అమెరికాతో కుదుర్చుకోవడానికి అక్కడికి వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఇరుదేశాల అధ్యక్షులు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే జెలన్‌స్కీ యుద్ధ కాంక్షతో ఉన్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై జెలన్‌స్కీ కూడా తీవ్ర అభ్యంతరం చేశారు. ఈ ఇద్దరు నేతలు మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీపై ట్రంప్ మాత్రమే కాదు ఉపాధ్యాయుడు వాన్స్ కూడా మండిపడ్డారు. మీరు డిక్టేటర్ షిప్ చేయాలనుకుంటే కుదరదు.. సింపతి కార్డు యూజ్ చేయకండి. లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు.. అంతే కాదు మీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం కూడా వచ్చేలా ఉంది అని జెలన్‌స్కీ ముఖంపైనే ట్రంప్ అనేశారు.. అదేవిధంగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తీవ్రస్థాయిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు పై మండిపడ్డారు..
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఎన్నో రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత అమెరికా ప్రభుత్వం జో బైడెన్ ఉన్నప్పుడు ఉక్రెయిన్కు భారీగా నిధులు చేరాయి. అదే విధంగా సామాగ్రి కూడా సమకూర్చింది.. దీంతో రష్యాకు దీటుగా పోరాటం చేసింది ఉక్రెయిన్. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు.. యుఎస్ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు ..అంతా తారుమారు అయింది. అమెరికా అధ్యక్షుడు ప్రధానంగా ఉక్రెయిన్ కు నిధుల మంజూరు నిలిపివేశాడు. అంతేకాదు అసలు యుద్ధం జరిగింది జెలన్‌స్కీ వల్లే అని మీడియా ముందే తిట్టిపోశారు.
ఇదీ చదవండి: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. మార్చి 13, 14, 15, 16 వరుసగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు.. ఎందుకు తెలుసా?
దీంతో అమెరికా , ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య వైట్ హౌట్‌లో ఈ విధంగా అర్ధాంతరంగా భేటీ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో ఖనిజాల ఒప్పందంపై ఇరుదేశాల నేతలు సంతకం చేయలేదు. వాస్తవవానికి జెలన్‌స్కీ వచ్చిందే డీల్ కోసం.. కాని దాన్ని పూర్తి చేయకుండానే ఆయన వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు…
WTF. Trump points at Zelensky: “You see the hatred he’s got for Putin. He’s got tremendous hatred”
PUTIN INVADED HIS COUNTRY AND KILLED 50,000 PEOPLE.
— CALL TO ACTIVISM (@CalltoActivism) February 28, 2025
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో జరిగిన వాగ్వాదం గురించి జెలన్‌స్కీ ట్వీట్ చేశాడు..' థాంక్యూ యూఎస్.. థాంక్యూ ప్రెసిడెంట్ మాకు శాశ్వత శాంతి కావాలి.. మేము అందుకోసమే పని చేస్తున్నాం' అని ట్విట్ చేశాడు. ముఖ్యంగా రష్యాతో యుద్ధం ముగించుకోవాలి అనుకుంటున్నాం.. అని అన్నారు. అయితే ట్రంప్ మాత్రం జెలన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందే ఆరోపించారు..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం గొడవపై స్పందించారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాకు అమెరికాను జెలన్‌స్కీ అవమానించాడు.. శాంతి కోరుకున్నప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాడు అన్నారు..ఈ వాగ్వాదం పై స్పందించిన రష్యా ఇంకా నయం ట్రంప్, జెలన్‌స్కీని కొట్టకుండా వదిలేశాడు అని స్పందించింది. వైట్‌హోస్ సమావేశంలో అన్ని అబద్ధాలే మాట్లాడారని ఆరోపించింది రష్యా. ఈ ఘటన జెలన్‌స్కకి ఒక చెంపపెట్టు లాంటిదని రష్యా మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయనను ఒక పొగరుబోతు పందిగా కూడా అభివర్ణించారు..
ఇదీ చదవండి: మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్.. ముందుగానే తెలుసుకోండి..
అయితే యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు మాత్రం జెలన్‌స్కీకి సపోర్ట్ గా నిలిచాయి.. ఉక్రెయిన్ ఒంటరిది కాదు.. ఈయు దేశాలు మొత్తం మద్దతుగా ఉన్నాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేకరాన్ సహా ఇతర దేశ అధ్యక్షులు ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే అమెరికా, ఈయూ దేశాల మధ్య సుంకాల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
Wow. This is such an embarrassment for the United States.
Trump and JV Vance literally switched sides in a war and sided with a murderous dictator. Now they want Zelensky to apologize and kiss their feet. This shit makes me sick. pic.twitter.com/eE07vpFwvl
— Sawyer Hackett (@SawyerHackett) February 28, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









