Donald Trump: భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్.. ఏకంగా 85 వేల వీసాలు రద్దు..

Donald Trump Big Shock to Indians: వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ భారీ షాకిచ్చారు. జనవరి నుంచి 85వేల వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘మేక్‌ అమెరికా సేఫ్‌ ఎగైన్‌’ అని అందులో పేర్కొంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 11:01 AM IST
Donald Trump: భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్.. ఏకంగా 85 వేల వీసాలు రద్దు..

వీసాలు రద్దు అయిన వారిలో 8,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, దొంగతనం వంటి నేరారోపణలే ఈ వీసా రద్దులకు ప్రధాన కారణాలుగా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. భద్రతా తనిఖీలలో ఎలాంటి రాజీ పడబోమని తెలిపారు.  ప్రతి దరఖాస్తుదారుడు అమెరికన్లకు సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వీసా జారీ చేస్తామని ఆ అధికారి స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source

అమెరికా పౌరుల భద్రత, ప్రజా భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా అమెరికన్  ప్రభుత్వం ఈ  కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వివిధ కేటగిరీలకు చెందిన 85 వేల వీసాలను రద్దు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది గత సంవత్సరం రద్దు చేసిన వాటి కంటే రెట్టింపు కావడం గమనార్హం. 

అడ్మినిస్ట్రేషన్ వీసా పరిశీలన విధానం అత్యంత కఠినంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా హై-రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  2021లో సైనిక ఉపసంహరణ తర్వాత అఫ్గనిస్థాన్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఎప్పుడూ ఆందోళనలు ఉన్నాయన్నారు. వీసా దరఖాస్తుదారులు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించకుండా నిరోధించడానికి తనిఖీలను కఠినతరం చేశామని అధికారులు తెలిపారు. భద్రతా తనిఖీలలో ఎలాంటి తొందరపాటు ఉండదు. దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించడని నిర్ధారించుకునే వరకు వీసా జారీ చేయబడదని అధికారులు స్పష్టం చేశారు.

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

భారతీయులకు జారీ చేసిన దాదాపు 80 హెచ్​1బీ వీసాలు నకిలీవని  భారతీయ- అమెరికన్​ దౌత్యవేత్త మహవష్​ సిద్ధిఖీ  ఆరోపించారు. వాటిలో ఫేక్ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్ల ద్వారా వాటిని పొందారని చెప్పారు. హెచ్​1బీ వీసాకు కావాల్సిన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు లేవన్నది ఆయన మాట. చెన్నై సిటీ నుంచి 2 లక్షలకు పైగా హెచ్​1బీ వీసాలు రావడంపై అనుమానం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. వీసా, వలసదారులపై జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 85 వేల వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా. ఇందులో భారత్‌కి చెందినవారు ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టత రావాల్సివుంది.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News