Trump Vs Zelenskyy: ఉక్రెయిన్ అధినేత వ్లాదిమర్ జెలన్స్ కి ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో రీసెంట్ గా జెలెన్ స్కీ మీడియా ముందు వాగ్వాదానికి దిగడం ప్రపంచ వ్యాప్తంగా రచ్చగా మారింది. ఈ సమయంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ కు అందించే మిలిటరీ సహాయాన్ని నిలిపివేసింది. వైట్ హౌస్ కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.అధ్యక్షుడు ట్రంప్ శాంతి స్థాపన పై దృష్టి పెట్టినట్లు వైట్ హౌస్ తెలిపింది. అంతేకాదు తమ భాగస్వాములు కూడా ఆ లక్ష్యానికికట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే తమ ఉక్రెయిన్ కు అందజేస్తూన్న యుద్ధ సాయాన్ని నిలిపి వేస్తున్నట్టు ఓ ప్రకటనలోపేర్కొన్నారు .అయితే ఇది తాత్కాలికమేనని వెల్లడించారు రష్యాతో శాంతి చర్చలకు క్యూపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి తెరదించేందుకు శాంతి ఒప్పందం కుదర్చడం.. ఉక్రెయిన్ లోని ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికాచేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలన్ స్కీ తో ట్రంప్ తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనాదురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ట్రంప్ పై ఒత్తిడి చేశారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జెడిఆగ్రహం తెప్పించింది. సాయం అందించిన దేశానికి కృతజ్ఞతలు చెప్పడం మాని అవమానిస్తున్నారంటూ వారు జెలన్స్కి పై మీడియా ముందే మండిపడిన సంగతి తెలిసిందే కదా. ఈ చర్చలు కాస్త రసాభాసాగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలన్ స్కీ శ్వేత సౌధం నుంచి బయటకు వచ్చేసారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలుఎప్పుడూ రుణపడి ఉంటారని జెలెన్ స్కీ పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందన్నారు. అప్పటివరకు అగ్రరాజ్యం సహకారం అందుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వాషింగ్టన్ మిలిటరీ సాయం నిలిపి వేయడంఇప్పుడు చర్చనీయా అంశంగా మారింది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









