)
Donald Trump Diwali Wishes Video: వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆయన పలువురు భారత సంతతి అధికారులతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ మోదీ తనకు మంచి మిత్రుడు అని ఇరుదేశాల మధ్య వాణిజ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీతో తాజాగా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. వైట్ హౌస్ లో నిర్వహించిన దీపావళి వేడుకలు భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యుద్ధాలను ఆపుతూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని కూడా నెలకొల్పుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
అంతేకాదు నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు అని కూడా పిలిచారు. అమెరికా భారత సంబంధాలు శాంతితో సంబంధాలు కొనసాగాలన్నారు.. భారత ప్రజలకు ట్రంపు హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా భారత్ పాక్ యుద్ధంపై కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించాడు. దీపావళి అంటే అజ్ఞానం పై జ్ఞానం.. చెడుపై మంచి సాధించిన విజయమని ట్రంప్ పేర్కొన్నారు.
#WATCH | Washington, DC | On the occassion of Diwali, US President Donald Trump says, "Let me extend our warmest wishes to the people of India. I just spoke to your Prime Minister today. Had a great conversation. We talked about trade... He's very interested in that. Although we… pic.twitter.com/xqQeNKnIpq
— ANI (@ANI) October 21, 2025
అంతేకాదు దీపావళి సందర్భంగా వేడుకలు జరుపుకునేవారు శత్రువుల ఓటమి అడ్డంకులను అధిగమించడం బందీలను విడిపించడం వంటివి కూడా గుర్తు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని జ్ఞాన మార్గాన్ని అనుసరించడం అంటూ దివ్య జ్వాల ప్రతి ఒక్కరిని గుర్తు చేస్తుంది అన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని దీపావళి వేడుకల్లో భారత సంతతి చెందిన పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. కాష్ పటేల్, తులసి గబ్బార్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
#WATCH | Washington, DC | On being asked by ANI if tariffs would be imposed on China for buying crude oil from Russia, US President Trump says. "... Right now, as of November 1st, China will have about 155% tariffs put on it. I don't think it's sustainable for them. I want to be… pic.twitter.com/WGtOBK3HiF
— ANI (@ANI) October 21, 2025
ఇక భారత్ పై అమెరికా సుంకాలు పెంపు తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇలా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌పై అధిక సుంకాలు కూడా విధించారు అని ఆయన పేర్కొన్నారు. డోనాల్డ్ ట్రంప్ తో ఇటీవల ఢిల్లీ సందర్శించిన కీర్ స్టార్మర్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా వారు ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి