Trump Vs Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల మోతతో భారత స్టాక్ మార్కెట్స్ అతలాకుతలం అవుతున్నాయి. ఇవన్నీ తాత్కాలికమే అంటున్నారు మార్కెట్ అనలిస్టులు. మొత్తంగా సుంకాల సమానత్వం సాధిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించబోదని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా వుండగా అమెరికాలో పెంచిన సుంకాల వసూలు బుధవారం నుంచి మొదలు కానుంది. ఈ సుంకాలు చైనాపై మరింతగా విధిస్తామని హెచ్చరించారు. ‘చైనా విధించిన 34 శాతం సుంకాలను మంగళవారంలోగా ఉపసంహరించుకోకపోతే బుధవారం నుంచి అదనంగా 50 శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ అల్టీమేట్ జారీ చేశారు. వారితో అన్ని రకాల చర్చలను నిలిపేస్తామన్నారు ట్రంప్. ఓ వైపు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నా.. ఆర్థిక మాంద్యం భయాలు వెన్నాడుతున్నా.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మునిగిపోతున్నా ట్రంప్ తన వైఖరికే కట్టుబడి ఉన్నారు. ఇక ఎన్నికల ముందు వివిధ దేశాలపై విధిస్తానన్నా టారీఫ్ లను అధ్యక్షుడు అయ్యాక అమలు చేయడం మొదలు పెట్టారు. అమెరికా ఫస్ట్ అన్న నినాదమే ఆయన్ని తిరిగి రెండోసారి అధ్యక్ష పీఠం వరించేలా చేసింది. అందుకు తగ్గట్టే అమెరికా అధ్యక్షుడి చర్యలు ఉంటున్నాయి.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ...అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవాలని కోరుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు కొన్ని నయం చేసుకోవాలంటే ఔషధాలను వాడాల్సిందే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వుకు సూచించారు. అయితే సుంకాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, వడ్డీ రేట్ల తగ్గింపుపై కొంత కాలం ఎదురుచూడాల్సి ఉందని ఫెడరల్ రిజర్వు ఛైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
సుంకాల ఎత్తివేతపై చర్చల కోసం తమను 50 వరకూ దేశాలు సంప్రదించాయని అమెరికా అధికారులు వెల్లడించారు. దీనిపై ట్రంప్ స్పందించారు. తాను చాలా మంది నేతలతో మాట్లాడానని, ఐరోపా, ఆసియా తదితర ప్రపంచ దేశాల నేతలంతా మాట్లాడుతున్నారన్నారు. వారంతా అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పన్నుల్లో కనీసం సమానత్వం సాధించాలనేది తమ లక్ష్యం మని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ సుంకాలను తగ్గించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం తప్పదని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని, విదేశీ వినియోగదారుల బాయ్‌కాట్‌తోపాటు విధానాల్లో అస్పష్టతతో మూలధన వ్యయంలో క్షీణత నమోదు కావడం ఖాయమని చెబుతుంది. దీనివల్ల ఊహించిన దాని కంటే సంక్షోభ తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని అభిప్రాయపడింది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









