Gold Card: గోల్డ్‌కార్డు విక్రయాలు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. అర్హత, అప్లై చేసుకునే విధానం..!

Donald Trump Gold card Apply: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభించాడు. ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.9 కోట్లు చెల్లించి దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఆ దేశంలో శాశ్వతంగా హోదా పొందవచ్చు. అదే కంపెనీలు విదేశీ ప్రతిభను నిలుపుకోవడానికి రెండు మిలియన్ డాలర్లు చెల్లించాలి. ఇది కొంతవరకు గ్రీన్ కార్డు లాంటిది. అయితే ఈ అమెరికన్ గోల్డ్ కార్డుకు ఎలా అప్లై చేయాలి? ఎవరు అర్హులు? ఎంత ఖర్చవుతుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2025, 08:39 AM IST
Gold Card: గోల్డ్‌కార్డు విక్రయాలు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌.. అర్హత, అప్లై చేసుకునే విధానం..!

Donald Trump Gold card Apply: అమెరికా పెద్దన్న అనుకున్నది సాధించాడు. గోల్డ్ కార్డు విక్రయాలు ప్రారంభించాడు. అమెరికాలో ఉండాలంటే.. శాశ్వత హోదా పొందాలంటే కూడా ఈ గోల్డ్ కార్డు తప్పకుండా ఉండాల్సిందే. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డు వీసాను విదేశీయులకు ఒక మిలియన్ డాలర్లు అంటే మన భారత రూపాయిలో రూ. 9 కోట్లు చెల్లించి.. దీని పొందితే ఆ దేశంలో శాశ్వత హోదా లభిస్తుంది. ఒకవేళ కంపెనీలు విదేశీ ప్రతిభను నిలుపుకోవడానికి రెండు మిలియన్ డాలర్లు చెల్లించాలి. ఇది దాదాపు గ్రీన్ కార్డుల పని చేస్తుంది. కానీ దానికంటే పెద్ద ప్రయోజనాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇక ట్రంప్‌ గోల్డ్‌ కార్డు అప్లై చేసే సమయంలో 15 వేల డాలర్లు ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Add Zee News as a Preferred Source

అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ వేదికగా ఈ ప్రకటన చేశాడు. వలసలను నిరోధించి అమెరికా బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి ఈ కార్డును పరిచయం చేశారు. ట్రంప్ గోల్డ్ కార్డు ఇక ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో శాశ్వతంగా పౌరసత్వం పొందాలంటే ఇది తప్పనిసరి. 'ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ట్రంప్ గోల్డ్ కార్డు' ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చని ట్రంప్‌ ప్రకటించారు. అమెరికన్ విద్యాసంస్థల విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ప్రతిభ ఉన్న వారిని కూడా అమెరికా సంస్థల్లో చేర్చుకోవచ్చు అని ప్రకటించారు.

 ట్రంప్ గోల్డ్ కార్డు ప్రోగ్రాం..
ట్రంప్‌ గోల్డ్‌ కార్డు ద్వారా యూఎస్ కంపెనీలను స్కిల్ వర్కర్లు నియమించుకునే విధంగా సహాయ పడతుంది.  14351 సెప్టెంబర్ లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ ద్వారా రూపొందించారు. యూఎస్ లో శాశ్వతంగా స్థిరపడ్డాలంటే ఇది అతి త్వరగా జరిగే ప్రోగ్రాం.

 గోల్డ్ కార్డ్ 3 టైర్..
 గోల్డ్‌ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు 3 టైర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. మొదటిది  ట్రంప్ వ్యక్తిగత గోల్డ్ కార్డు. రెండోది ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డు. చివరిది ట్రంప్ ప్లాటినం కార్డు.

ఎలా అప్లై చేసుకోవాలి?
 ట్రంప్ గోల్డ్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే అధికారిక వెబ్సైట్ www.trumpcard.com. దీనికి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా అప్లై చేసుకోవాలంటే గోల్డ్ కార్డుతో వన్ టైం నాన్ రీఫండబుల్‌ గిఫ్ట్ యూఎస్ డాలర్ వన్ మిలియన్ తో పాటు 15 వేల యుఎస్ డాలర్ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ట్రంప్ కార్పొరేట్ గోల్డ్ కార్డు..
ఈ కార్డు ద్వారా హై స్కిల్డ్‌ వ్యక్తులను అమెరికన్‌ కంపెనీలు ఎంచుకోవచ్చు. కాకపోతే దీనికి రెండు మిలియన్ యూఎస్ డాలర్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు 15 వేల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇది ఒక ఉద్యోగి నుంచి మరో ఉద్యోగికి సులభంగా బదిలీ కూడా చేయవచ్చు. 

ట్రంప్ ప్లాటినం కార్డు..
ట్రంప్ ప్లాటినం కార్డు అనేది హయ్యర్ టైర్ దీనికి 5 మిలియన్ యుఎస్ డాలర్స్ తో పాటు 15 వేల ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 270 రోజులపాటు యుఎస్ లో ఉండవచ్చు. దీనికి ఎలాంటి ట్యాక్స్ లు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధానంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

Read more: 36 ప్లాట్‌ఫారమ్స్‌.. 20 ఎంట్రీ గేట్లతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వేస్టేషన్‌.. భారత్‌, చైనా, యూఎస్‌ కాదు..!

Read more: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News