Trump Gold Card: అమెరికాలో గోల్డ్ కార్డ్ కు భారీ గిరాకీ.. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులే లక్ష్యంగా ‘ట్రంప్’ కార్డ్..

Trump Gold Card:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించిన 'గోల్డ్‌ కార్డు'కు భారీ గిరాకీ  కనిపిస్తోంది. అమెరికా పౌరసత్వం కోరుకునే సంపన్నుల కోసం డొనాల్డ్ ట్రంప్ ఈ స్కీమ్ తీసుకొచ్చాడు. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఇదో వరంగా మారిందనే చెప్పాలి. అంతేకాదు వీటిని కొనేందుకు సంపన్నులు పోటీ పడుతున్నారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 09:53 AM IST
Trump Gold Card: అమెరికాలో గోల్డ్ కార్డ్ కు భారీ గిరాకీ.. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులే లక్ష్యంగా ‘ట్రంప్’ కార్డ్..

Trump Gold Card: డొనల్డ్ ట్రంప్ ఏదో గోల్డ్ కార్డ్ ప్రవేశ పెడితే.. ఎవరన్న రెస్పాండ్ అవుతారనుంటే.. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా వచ్చే అమెరికా పౌరసత్వం కోసం ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు పోటీ పడుుతన్నారు.  ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి వెల్లడించారు. వీటి ద్వారా 5బిలియన్‌ యూస్ డాలర్లు సేకరించినట్లు తెలుస్తోంది.  లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.  వీటిద్వారా 5 ట్రిలియన్‌ డాలర్లు సేకరించే అవకాశం ఉందని అమెరికా యంత్రాంగం చెబుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందని అగ్రరాజ్యం చెబుతోంది. కనీసం 10లక్షల మందైనా ఈ కార్డును కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నట్టు సమాచారం.  

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్​ వీసా ఈబీ-5 స్థానంలో ఈ గోల్డ్‌ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. 5 మిలియన్‌ డాలర్లు చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామంటోంది.  అమెరికాకు వచ్చి భారీగా ఖర్చుపెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నట్టు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది.  

ఈబీ-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు. అయితే, ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్‌ కార్డును ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే  కదా.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News