)
100 Percent Tariffs On Pharma Products: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం అని సాకుతో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 50% సుంకాల విధించాడు. అయితే తాజాగా ఫార్మా పై కూడా 100% సుంకాల విధిస్తామని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు యుఎస్ లో ఉత్పత్తి కానీ తయారీ ప్లాంట్ లేని ఫార్మా ఉత్పత్తులపై ఈ 100% పన్ను విధిస్తామని అన్నారు. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ అమెరికాలో ఫార్మ కంపెనీ నిర్మాణంలో ఉంటే వారికి ఇది వర్తించదని పేర్కొన్నారు. ఓ రకంగా భారత్ పై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
ప్రధానంగా ఈ ఫార్మా కంపెనీలో అతిపెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనకు అమెరికానే. అక్కడ వాడే 45% జనరిక్, 15% బయో సిమిలర్ డ్రగ్స్ భారత్ నుంచే వెళ్తాయి. ఇక 2024లో మొత్తం 27.9 బిలియన్ డాలర్ల ఉత్పత్తుల్లో 8.7 బిలియన్ డాలర్లు యూఎస్ఏ ఎగుమతి అయ్యాయి. అంటే ఇండియన్ కంపెనీలకు 50 శాతం వరకు రెవెన్యూ అక్కడి నుంచే వస్తుంది.
ఇక యుఎస్ కు ఫార్మా ఎగుమతులు చేసే దేశాల్లో ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. 2024 గణాంకాల ప్రకారం సుమారు 65.7 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్, భారత్, బెల్జియం, ఇటలీ, చైనా, యూకే, జపాన్ జాబితాలో ఉన్నాయి. అంటే భారత్ ఐదవ స్థానంలో నిలిచింది. ఇక ఈ ఫార్మా ఉత్పత్తులతో పాటు కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కులపై కూడా దిగుమతి సుంకాలు కూడా ప్రకటించింది అమెరికా.
ప్రధానంగా దేశీ తయారీని ప్రోత్సహించడానికి జాతీయ భద్రత కోసమే ఈ సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. 100% ఫార్మా, కిచెన్ క్యాబినెట్, బాత్రూం వానిటీలపై 50% పన్ను విధిస్తున్నారు. ఇక భారీ ట్రక్కులపై 25% వరకు విధిస్తున్నట్లు తెలిపారు. ఇది 2025 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఏ బ్రాండ్ అయినా పేటెంట్ పొందిన ఔషధ ఉత్పత్తులైన కానీ 100% సుంకం విధిస్తామని ఆయన చెప్పారు.
దేశీ పరిశ్రమలు కాపాడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అమెరికా ఇప్పటికే ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆర్థిక నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ సుంకాలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. ఇది ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు నిపుణులు. బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్నం ఎంతగా ప్రభావం చూపుతుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook