)
Donald Trump On India Tariffs: భారత్ పై టారిఫ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా పెద్దన్న మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌తో ఆయన ఇండియా టారిఫ్స్ పై మాట్లాడాడు. రష్యాకు ఇండియా అతిపెద్ద కస్టమర్. అందుకే ఆ దేశం నుంచి ఆయిల్ కొంటుందని టారిఫ్స్ వేశాను. కానీ వాస్తవానికి ఆ సమస్య మాది కాదు ..యూరప్ ది. కానీ, అసాధ్యం అనుకున్న వాటిని నేను పరిష్కరించాను. అలా భారత్ పాక్ తో సహా ఏడు యుద్ధాలు ఆపానని వ్యాఖ్యానించారు. ఇక ఇండియా పై టారిఫ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ రష్యాకు ఇండియా అతిపెద్ద కస్టమర్ కాబట్టి 50% సుంకాలు వేశాను.. కానీ అదంతా ఈజీ విషయం కాదు. ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయి అన్నారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా వరకు దేశాలు అమెరికా షరతులను అంగీకరించాయి. తమ విధివిధానాలను పాటించని వారు అత్యంత శక్తివంతమైన దేశం నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు. ఇక భారత్ కూడా ఆ జాబితాలోకి వచ్చింది. అమెరికాకు తలవంచని దేశం కాబట్టి దీనిపై అదనంగా 25 మొత్తంగా 50% విధించామన్నారు. రష్యా ఉక్రెయిన్ సమస్య తమ దేశానికి చెందింది కాదు. యూరప్ కంట్రీలది కానీ భారత్-పాకిస్తాన్ యుద్ధం వివాదాన్ని మాత్రం తెరదించింది మేమే.. కాంగో, రువాండా మధ్య కూడా యుద్ధం ఆపాం అని పేర్కొన్నాడు. దీనిపై భారత్ కూడా గతంలో కూడా స్పందించింది. భారత్ తమ స్వంత ప్రయోజనాలను పరిశీలిస్తూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఇది మార్కెట్‌కు అనుకూలంగానే ఉంది అని చెప్పారు.
భారత్ పై సుంకాలు విధించాలి..
ఇదిలా ఉండగా భారత్ పై సుంకాలు విధించాలని G7, EU దేశాలను అమెరికా రిక్వెస్ట్ చేసినట్లు ఇటీవలి రాయిటర్స్ తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా పై సుంకాలు విధించాలని G7 దేశాలు, యూరోప్ యూనియన్ దేశాలు అమెరికా కోరినట్లు రాయిటర్స్ ప్రకటించింది. G7 ఫైనాన్స్ మినిస్టర్ల మధ్య జరిగిన ఫోన్ కాల్ లో దీనిపై చర్చ జరిగినట్లు తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తేవాలని వారు చర్చించినట్లు తెలిపింది. ఫ్రీజ్ చేసిన రష్యా అసెట్స్ ను వినియోగించుకొని ఉక్రెయిన్ రక్షణకు నిధులు సమకూర్చేందుకు అంగీకరించారని కూడా వెల్లడించింది.
मैंने भारत पर 50% टैरिफ ठोक दिया, क्योंकि वो रूस से तेल खरीद रहा था.
- मोदी के सबसे प्यारे दोस्त ट्रंप ने कहा
---
दलाल पर 16 करोड़ रुपए फूंकने का क्या फायदा, जब ट्रंप ऐसे ही बेइज्जत करता रहेगा. pic.twitter.com/SxbpJWgM5h
— Ranvijay Singh (@ranvijaylive) September 12, 2025
ఇదిలా ఉండగా 50 శాతం సుఖాలు విధించిన భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. ఇప్పటికే అమెరికాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇటీవలే కేవలం సెకండరీ టారిఫ్స్ మాత్రమే విధించాము మూడు, నాలుగు ఉంటుంది. ఇప్పుడే అయిపోలేదు అని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.