Donald Trump: మరోసారి తన కపటబుద్దిని బయట పెట్టుకున్న ట్రంప్..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన కపటబుద్ధిని బయట పెట్టుకున్నారు. తనకు పాకిస్థాన్ అంటే చాలా ఇష్టం అని యుద్ధాన్ని తానే ఆపానని తెలిపారు. ఐ లవ్ పాకిస్థాన్ అని వ్యాఖ్యానించారు. మోడీ గొప్ప వ్యక్తి అని నిన్న రాత్రే ఆయనతో మాట్లాడానని చెప్పారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 19, 2025, 10:33 AM IST
Donald Trump: మరోసారి తన కపటబుద్దిని బయట పెట్టుకున్న ట్రంప్..

Donald Trump:  అమెరికా తన వాచాలత్వాన్ని ప్రదర్శిస్తోంది. అందునా.. నరంలేని అమెరికా అధ్యక్షుడు తన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా మన దేశంపై ఎగదోస్తున్న పాకిస్థాన్, భారత్ ను ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ లో అమెరికాలో ఎవరికీ తెలియకుండా కొన్ని అణు పరీక్షలు నిర్వహించింది. దానికి సంబంధించిన స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా  సర్గోదాతో పాటు పలు వైమానికంగా.. అణు పరంగా కీలకమైన స్థావరాలను నామా రూపాల్లేకుండా చేసింది. దాంతో పాటు అమెరికా ఇచ్చిన కొన్ని యుద్ధ విమానాలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ లో అమెరికా యుద్ధ  విమానాలకు గిరాకీ తగ్గే అవకాశాలుననాయి.   దీంతో అలర్ట్ అయిన అమెరికా వెంటనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. భారత్ తో సంధి చేసుకోమని పాకిస్థాన్ కు సూచించింది. 

దీంతో పాకిస్థాన్ మన దేశానితో కాళ్ల బేరానికి వచ్చింది. ప్రస్తుతానికి భారత్ సర్కారు కూడా తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ ను పక్కన పెట్టినట్టు చెప్పారు. ఎపుడైతే పాకిస్థాన్ తోక జాడిస్తే తమ ప్రతాపం ఏంటో చూపిస్తానంటోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని నిర్దేశిత 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. తాజాగా పాకిస్థాన్ కు ఐ లవ్ అంటూ చెప్పి ట్రంప్ మరోసారి తన కపట బుద్దిని చాటుకున్నారు. 

భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. పాకిస్థాన్ నుండి అసిఫ్ మునీర్‌తో భారత్ నుండి నరేంద్ర మోడీతో మాట్లాడి యుద్ధాన్ని ఆపానని చెప్పారు. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు అని శక్తివంతమైన దేశాలని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలోనూ ట్రంప్ భారత్,  పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్, పాకిస్థాన్ ఖండించాయి. అయినప్పటికీ ట్రంప్ మరోసారి యుద్ధం తానే ఆపానని కామెంట్లు చేయడం విస్మయం కొలుపుతుంది. 

Also Read : అప్పట్లో విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరు, బాలయ్య.. అసలు ఏం జరిగిందంటే..

Also Read : ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించే ఏకైక శాండల్‌వుడ్ నటి.. వందల కోట్ల ఆస్తులు ఉన్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News