Trump Phone Call To Putin: డొనల్డ్‌ ట్రంప్‌ సంచలనం.. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు?

Donald Trump Phone Call To Vladimir Putin: కొన్నేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ముగిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ ఒకడుగు ముందుకు వేశారు. ఆయన చేసిన పనితో యుద్ధం ముగియనుందని చర్చ జరుగుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2025, 11:28 PM IST
Trump Phone Call To Putin: డొనల్డ్‌ ట్రంప్‌ సంచలనం.. రష్యా -ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు?

Russia Ukraine War: ఏళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు లభించబోతుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ చొరవ తీసుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫోన్‌ చేయడం సంచలనంగా మారింది. ఇద్దరు దేశాధినేతలు కొన్ని నిమిషాల పాటు ఫోన్‌ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం ముగింపుపై చర్చించుకున్నట్లు వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Jaffar Express Hijack: పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్.. మిలిటెంట్ల చెరలో 400 మంది ప్రాణాలు

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమయ్యేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనల్డ్‌ ట్రంప్‌ ఒకడుగు ముందుకువేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఫోన్‌ చేశారు. వారిద్దరూ సుమారు రెండు గంటలకు పైగా చర్చలు చేశారని వైట్‌హౌస్‌ నుంచి వార్తలు వచ్చాయి. అయితే పుతిన్‌తో చర్చలకు సంబంధించి ట్రంప్‌ ముందుగానే వివరాలను చెప్పారు. పుతిన్‌తో తాను మాట్లాడబోతున్నట్లు.. భూమి, విద్యుత్‌ కేంద్రాలు, ఆస్తుల విభజనపై చర్చిస్తామని ప్రకటించారు.

Also Read: Sunita Williams Return Journey: అత్యంత ప్రమాదకరమైన చివరి 46 నిమిషాలు, 22 ఏళ్ల క్రితం అదే జరిగిందా

చెప్పిన మాట ప్రకారం పుతిన్‌కు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌ చేయడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఉక్రెయిన్‌- రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని డొనల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌ యుద్ధం ముగిస్తానని చెప్పిన మాట ప్రకారం ఆ ప్రయత్నాలు ట్రంప్‌ చేస్తున్నారు. ట్రంప్‌ ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించారు. 30 రోజుల కాల్పుల విరమణ జరుగుతున్న సమయంలో పుతిన్‌కు ఫోన్‌ చేయడం విశేషం. అయితే వీరిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ కొనసాగించేందుకు పుతిన్‌కు ట్రంప్‌ అంగీకరించేలా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. ట్రంప్‌ చొరవతో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగియాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు చాలా దేశాలపై తీవ్ర ప్రభావం పడింది. అంతేకాకుండా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది ప్రజలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News