Donald Trump Reaction On Not Getting Nobel: ఎన్నో రోజులుగా నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని ఆశలు పెట్టుకున్న డోనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ ప్రైజ్ రాకపోవడంపై ఆయన స్పందించారు కూడా. ఆయనకు బదులుగా నోబెల్ శాంతి బహుమతి కొరీనా మరియాను వరించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు నోబెల్ ప్రైజ్ తనకు రాకపోవడం పై స్పందించారు. నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచిన వ్యక్తి నాకు కాల్ చేసి నేను దానికి అర్హుడినని చెప్పారు. అయితే, నాకు ఇచ్చేయండి అని నేను అడగలేదు అని ఆయన సరదాగా మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. తాను లక్షలాదిమంది ప్రాణాలు కాపాడానని దాని పట్ల నాకు సంతోషంగా ఉందని ట్రంప్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఎన్నో రోజులుగా తాను ఇప్పటి వరకు ఎనిమిది యుద్ధాలు ఆపానని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతి తనని వరిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఏ పని చేయని ఒబామాకు నోబెల్ వరించింది. తాను దానికి అసలైన అర్హుడిని అని ఆయన పేర్కొన్నారు. అయితే, నోబెల్ శాంతి బహుమతి మాత్రం వెనిజులాకు చెందిన కొరీనాను వరించింది. ఏం చేయకుండానే ఒబామాకు నోబెల్ దక్కింది ఎందుకు ఇచ్చారో తెలియదు.. ఒబామా మన దేశాన్ని నాశనం చేయడం తప్ప ఇంకేం చేయలేదు. ఆయన వరస్ట్ ప్రెసిడెంట్ కూడా అని డోనాల్డ్ ట్రంప్ ఒబామాపై అక్కసు వెళ్లగక్కారు. తాను మాత్రం ఎనిమిది యుద్ధాలు ఆపాను అన్నారు. కాగా 2009లో ప్రెసిడెంట్ అయిన ఎనిమిది నెలలకే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి రావడం అందరికీ తెలిసిందే.
? Donald Trump loses it again. Says the Nobel Peace Prize winner Personally CALLED him to say
? "I’m accepting this in your honour because YOU deserved it."
I didn't say then give it to me. ?
US campaigned all year for a Nobel & still got SNUBBED pic.twitter.com/734ztsxSyH
— श्रवण बिश्नोई (किसान/ Hindus) (@SKBishnoi29Rule) October 11, 2025
నోబెల్ ట్రంప్‌కు అంకితం..
అయితే నోబెల్ శాంతి బహుమతి పొందిన మరియా మచాడో మాత్రం ట్రంప్‌తో పాటు నిర్విరామంగా పోరాడుతున్న తమ దేశ ప్రజలకు అండగా నిలబడ్డ ప్రపంచ దేశాలకు ఈ బహుమతి డెడికేట్ చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులా ప్రజలకు మద్దతు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని అంకితమిస్తున్నట్లు ఈ ఉద్యమకారిని తెలియజేశారు. ప్రజాస్వామ్య దేశాలు తమకు మద్ధత ఉంది మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఫ్రీడం సంపాదించడానికి నోబెల్ ప్రకటన మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె వివరించారు.
ఇక నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మరియాకు 11 మిలియన్ల స్వీస్ క్రోనార్ అంటే దాదాపు రూ.10.25 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ఇవ్వకపోవడంపై నార్వే కమిటీ కూడా వివరణ ఇచ్చింది. ఆయన పేరిట వచ్చిన నామినేషన్లు అన్నీ జనవరి 31 గడువు తేదీ ముగిసిపోయాక వచ్చినవేనని స్పష్టం చేసింది.
నోబెల్ ప్రతిష్ఠ కోల్పోయింది: రష్యా
ఇక నోబెల్ పీస్ ప్రైజ్ వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. రష్యా ప్రెసిడెంట్ ట్రంప్ శాంతిని నెలకొల్పారు. శాంతి కోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ వరించింది అది ప్రతిష్ఠను దెబ్బతీసింది అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసి చూపించారు.. ప్రైజ్‌కు అర్హులు అని నేతన్యాహు కూడా అన్నారు.
నోబెల్ శాంతి ప్రకటనకు కొద్ది గంటల ముందుగానే రష్యా ట్రంప్ నోబెల్‌కు అర్హులని మద్దతు తెలిపింది. అంతకుముందు పాకిస్తాన్ వంటి దేశాలు కూడా ట్రంప్ నోబెల్ కు అర్హులు అని ప్రతిపాదించింది. పాక్‌కు ప్రతి చోటా భంగపాటే ఎదురవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత చేతుల్లో చావు దెబ్బ తిని సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలతో నవ్వుల పువ్వులు పూయించారు. ఇక వైట్ హౌస్ లోకి వెళ్లి మరీ ఆసిఫ్ మునీర్, షాహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ తో ఫోటోలు దిగి శాంతి దూత అంటూ నోబెల్‌కు సిఫార్సు కూడా చేశారు. ట్రంప్‌ను నోబెల్ వరించకపోవడంతో వారి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లు అయిందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Read more: ట్రంప్ మెడలో నోబెల్ మెడల్.. AI ఇమేజ్ షేర్ చేసిన ప్రధానమంత్రి, ఫోటో వైరల్..
Read more: ఆలస్యం చేస్తే అస్సలు ఊరుకునేది లేదు.. హమాస్‌కు అమెరికా అధ్యక్షుడి అల్టిమేటం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook









