)
Donald Trump On MEA Statement Video: ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తునందుకే ఉక్రెయిన్‌పై ఇంకా యుద్ధం రష్యా కొనసాగించడానికి సహాయపడుతుందని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో నిన్న భారత విదేశాంగ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. యూఎస్‌తోపాటు ఈయూ దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేస్తున్నాయి. వ్యవసాయ కెమికల్స్, ఎరువులు, పల్లాడియం దిగుమతులు చేసుకుంటున్నాయి. కేవలం ఇండియాపై ఆరోపణలు చేయడం తగదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
దీనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మీడియా సమావేశంలో ప్రతినిధులు స్పందించారు. దీనికి పెద్దన్న బదులిస్తూ తనకు దీని గురించి ఏమీ తెలియదు.. చెక్ చేయాలి అని రిప్లై ఇచ్చారు. దీంతో పలువురు నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దేశ అధ్యక్షుడికి ఈ విషయాలు తెలియవా? ఏం తెలియకుండా టారిఫ్స్ వేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
నెట్టంటా వైరల్..
ట్రంప్ వ్యవహార శైలి చూస్తుంటే మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉందని నెటిజెన్లు మండిపడుతున్నారు. రష్యా నుంచి అమెరికా వ్యాపారం చేస్తూనే ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి $24.51 బిలియన్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024 లో 3 బిలియన్ డాలర్లు బిజినెస్ చేసింది. కానీ, భారత్ ఆయిల్ దిగుమతి వల్లే రష్యాకు డబ్బులు వస్తున్నాయని అందుకే యుద్ధం కొనసాగిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. మరి వారు చేసేది ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
భారత ఆర్మీ కౌంటర్..
మరోవైపు నిన్న భారత ఆర్మీ కూడా అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. 1954-71 వరకు అమెరికా పాకిస్తాన్‌ను $2 బిలియన్ల విలువైన ఆయుధాలు సరఫరా చేసింది. వాటితో పాక్ ఈస్ట్ పాకిస్తాన్ (బంగ్లాదేశ్) లో దాడులు చేసిందని ఓ పేపర్ క్లిప్పింగ్ విడుదల చేసింది. ఇది యూఎస్ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.
ఇక నిన్న కూడా భారత్‌పై నిప్పులు చెరుగుతున్న ట్రంప్ 25 శాతం కంటే ఎక్కువ సుంకం భారత్‌పై 24 గంటల్లో విధిస్తామని కూడా ప్రకటించారు. దీంతో భారత్‌పై దీని ప్రభావం భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముందస్తు ప్రణాళిక ప్రకారమే అజిత్ దోవల్ ఈరోజు రష్యా పర్యటన వెళ్లారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది భౌగోలిక సున్నిత అంశంగా మారింది. అయితే, భారత్ సుంకాలు, చమురు, s-400 కొనుగోలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మాస్కో చేరుకున్న అజిత్ ధోవల్ పుతిన్‌ను కూడా కలిసే అవకాశం కూడా ఉంది.
#WATCH | Responding to ANI's question on US imports of Russian Uranium, chemical fertilisers while criticising their (Indian) energy imports', US President Donald Trump says, "I don't know anything about it. I have to check..."
(Source: US Network Pool via Reuters) pic.twitter.com/OOejcaGz2t
— ANI (@ANI) August 5, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook