Donald Trump On Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మే 7వ తేదీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత క్షిపణులు విరుచుకుపడ్డాయి. మొత్తంగా 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో 100 కు పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాది జై షే మహమ్మద్ కేంద్ర కార్యాలయం, రక్షణ కార్యాలయం లక్ష్యంగా జరిగింది. దీంతో మసూద్ కుటుంబంలోని మొత్తం 14 మంది హతమైనట్లు తెలుస్తోంది.
టిట్ ఫర్ టాట్..
ఈ ఆపరేషన్‌లో భారత ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆపరేషన్స్ సింధూర్‌పై వ్యాఖ్యానిస్తూ ఆ చర్య చాలా భయంకరమైన వాళ్ళు 'టిట్ ఫర్ టాట్ల' చేస్తున్నారు. ఇరు పక్షాలతో మంచి సత్సంబంధాలు నాకు ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకొని ఇంతటితో దీన్ని ఆపేస్తారని ఆశిస్తున్న, అందుకోసం నాకు చేతనైన సాయం చేస్తా అని ట్రంప్ వ్యాఖ్యానం చేశారు..
సంయమనం పాటించండి..
ప్రధానంగా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రెండు దేశాలు శాంతి పరిష్కారం కనుగొంటాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్, పీఓకేలలోని 9 ఉగ్ర శిబిరాల్లో వైమానిక దాడులను నిర్వహించింది భారత్. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ దాడులపై మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ యుద్ధం దశాబ్దాలుగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా భారత్ పాక్ మధ్యల పరిస్థితులను ఎప్పటికప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో పరిశీలిస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి : ఆపరేషన్ సింధూర్ సక్సెస్ వెనుక ఉన్న వీరనారీమణులు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఎవరు?
ఇదీ చదవండి : ఆపరేషన్ సింధూర్ హై అలర్ట్.. అక్కడ స్కూళ్లు, ఎయిర్‌పోర్టులు బంద్..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకర చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. ఈ ఉగ్రదాడిలో మొత్తంగా 27 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్నారు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు. ప్రధానంగా హిందువులను టార్గెట్ చేసి మగవాళ్ళను కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో ఆడవాళ్ళ సింధూరం చెరిపివేశారు కాబట్టి ఆపరేషన్ సింధూర్‌గా ఈ దాడులకు నామకరణం చేసి దాడులు నిర్వహించారు. మొత్తంగా ఆపరేషన్ సింధూర సక్సెస్ అయింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టింది భారత్. అయితే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ ఎల్‌ఓసీ వద్ద నిబంధనలో అతిక్రమించి కాల్పులు జరుపుతూనే ఉంది. ప్రతిరోజు కాల్పులు జరపటం వల్ల స్థానికంగా ఉండే పౌరులు ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. ఒక వీర జవాన్ కూడా మరణించారు దాదాపు 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు.
Reporter: Any reaction to the attacks between India and Pakistan?
Trump: It's a shame. We just heard about it as we were walking in the doors of the oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been… pic.twitter.com/lGfWsEZNuL
— Acyn (@Acyn) May 6, 2025
ఉక్రెయిన్ నీతులు..
ఇదిలా ఉండగా భారత్‌కు మాత్రం ఉక్రెయిన్ నీతుల చెబుతోంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ తగ్గించుకోవాలి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఉక్రెయిన్ సూచించింది. రెండు మూడేళ్లుగా యుద్ధం చేస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఉక్రెయిన్ భారత్‌కు మాత్రం నీతులు చెబుతుండటం గమనార్హం. మరోవైపు తమ దేశ పౌరులు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్ళకూడదని సింగపూర్ కూడా సూచనలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









