Donald Trump: సుంకాల విషయంలో ట్రంప్ యూ టర్న్.. పెద్దన్న నిర్ణయానికి కారణాలు అవేనా..!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారనే కన్నా.. యూ టర్న్ తీసుకున్నారని చెప్పాలి.  భారత్‌ సహా ఇతర దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2025, 07:52 AM IST
Donald Trump: సుంకాల విషయంలో ట్రంప్ యూ టర్న్.. పెద్దన్న నిర్ణయానికి కారణాలు అవేనా..!

Donald Trump: మరోవైపు  చైనాపై విధించిన టారిఫ్‌ను ఏకంగా 125 శాతానికి పెంచారు. డొనాల్ట్  ట్రంప్ తాజా నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకోనున్నాయి. అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్‌తో మార్కెట్లు ఒడుదొడులకు లోనవుతుండగా.. డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం గేమ్ ఛేంజర్‌గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్స్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. చైనా వస్తువులపై ఏకంగా 125 శాతం పన్ను విధించారు.  భారత్ సహా 75 దేశాలపై విధించిన టారిఫ్స్‌ను 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్టు తెలిపారు. దీంతో ట్రంప్ టారిఫ్స్ అంశం కొత్త మలుపు తిరిగింది. ప్రధానంగా ఇది అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్‌గా మారింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌ను ఖండిస్తూ వస్తున్న చైనా, కూడా అవే తరహాలో స్పందించింది. అమెరికా వస్తువులపై ఏకంగా 84శాతం పన్నులు విధిస్తున్నట్టు ప్రకటించింది.  ఇది ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు  తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన చైనాపై పన్నులను 125 శాతం మే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  

Add Zee News as a Preferred Source

ప్రపంచ మార్కెట్లను చైనా అగౌరవపరిచినందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను ఆ దేశంపై  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించిన ప్రతీకార సుంకాన్ని 125 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు.  ఇది వెంటనే అమల్లోకి వస్తుందంటూ  సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లలో గొప్ప మలుపుగా  మారుతుందని బిజినెస్‌ నిపుణులు విశ్వేషిస్తున్నారు.  ఏప్రిల్ 2న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా వస్తువులపై సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టపోయాయి. అనంతరం చైనా, ఇతర దేశాల స్పందనతో ఒడుదొడుకులకు గురయ్యాయి. ట్రంప్ తాజా ప్రకటన స్టాక్ మార్కెట్లకు జోష్ తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే  స్టాక్ మార్కెట్లు అమాంతం పెరిగి, గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం వుంది.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ట్రంప్‌  తీరుపై చైనా ఘాటుగానే స్పందించింది.  అమెరికా వెళ్లే తమ దేశస్తులకు  హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకొని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమ పౌరులకు సూచించింది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే విద్యార్థులు ఆయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అమెరికా వెళ్లే టూరిస్టులకు కూడా చైనా పర్యాటక శాఖ ఇదే విధమైన హెచ్చరికలు చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధిస్తున్న టారీఫ్ లతో  ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. చైనా, కెనడా దీటుగా స్పందిస్తూ ప్రతీకార సుంకాలు విధిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలో ‘ఈయూ’ కూటమి కూడా చేరింది. దీంతో కంపెనీలను అమెరికాకు తరలించాలని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. టారిఫ్‌ల సమస్య ఉండదని, వేగంగా అనుమతులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. మొత్తం మీద ట్రంప్ టారిఫ్‌ల వ్యవహారం ప్రపంచ వాణిజ్యంపై ఎటు దారి తీస్తుందో చూడాలి.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News