Trump Effect on Stock Markets:అమెరికా విమోచనదినం పేరిట భారత కాలమానం ప్రకారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ట్రంప్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రపంచ దేశాలపై బాంబులు పేల్చారు. చెబుతూ వస్తున్నట్టే ఏ దేశం మీద ఎంత టారిఫ్ విధిస్తోందీ లెక్కలతో సహా ప్రకటించేశారు. దీంతో అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ప్రపంచ మార్కెట్లు కూడా బెంబేలెత్తిపోతున్నాయి. ప్రపంచ దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధ ఫలితాలు క్షణాల్లో కనిపిస్తున్నాయి. మరోపక్క అమెరికా అధ్యక్షుడు తెరతీసిన వాణిజ్య యుద్ధంపై ప్రతీకారం తీర్చుకుంటానని కెనడా ప్రధాని ప్రతిజ్ఞ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ట్రంప్ దెబ్బకి ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి.
జపాన్ లీడింగ్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 3.5% అంటే భారీగా దాదాపు 1135 పాయింట్లు పడిపోయింది. మరో వైపు యూఎస్ స్వంత మార్కెట్ కూడా బాగా ప్రభావితమౌతోంది. యూఎస్ 30 ఇండెక్స్ ఏకంగా 2.16శాతం అంటే 890 పాయింట్లు కోల్పోయి కదలాడుతోంది. నిన్న అమెరికా మిగతా మార్కెట్ ఇండెక్స్‌లైన యూఎస్ టెక్ 100, డౌజోన్స్, S & P సూచీలు లాభాల్లో ముగిశాయి.
ట్రంప్ ఎఫెక్ట్ కారణంగా గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోతోంది. భారతదేశంపై 26% సుంకాలు విధించనున్నట్టు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోన్న అంశం. మన గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం గం. 6.30కి ప్రారంభం కాగానే భారీగా 390 పాయింట్ల నష్టాన్ని చవిచూసి, అనంతరం మెల్లిగా కోలుకుంటూ ఒక దశలో 140 పాయింట్ల నష్టం దగ్గర కదలాడుతోంది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









