
Watch Fazza Wins Heart: దుబాయ్ యువరాజు చేసిన పనికి అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆయన చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ మహమ్మద్ బిన్ రషిద్ ఆల్ మక్తూమ్ అని పిలుస్తారు. అయితే అకస్మాత్తుగా రెస్టారెంట్ కు వచ్చిన ఈ దుబాయ్ ప్రిన్స్ అక్కడ ఉన్న వారందరి బిల్లు కట్టి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఇలా దుబాయ్ ప్రిన్స్ క్రౌన్ హందాన్ బీన్ మహమ్మద్ బిన్ రషీద్ మరోసారి వార్తల్లో నిలిచి అందరి మన్ననలు పొందుతున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆయనను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. ఈయన్ను 'ఫజా' అని ముద్దుగా పిలుస్తారు. అంటే అరబిక్ భాషలో సహాయం చేసేవాడు అని అర్థం. స్నేహితులతో రెస్టారెంట్ కి వచ్చిన యువరాజు రాకతో అప్పటికే ఎంతోమంది సంతోషంతో మునిగిపోయారు. ఆయన ఇలా బిల్ కట్టి అందర్నీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ యువరాజు కూడా తన తండ్రిలాగే ఉదార స్వభావం కలిగినవాడు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో మహిళ పోస్ట్ చేసింది. అక్కడ రెస్టారెంట్లో ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరి బిల్ కట్టేసాడని ఆ మహిళా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
అంటే మన భారతీయ రుపీలో 5.8 లక్షల బిల్లు దుబాయ్ రాజు కట్టేశాడు. మహిళ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మిలియన్ కొద్ది వ్యూస్ వచ్చాయి. చాలావరకు ఈ దుబాయ్ యువరాజుకు కూడా తన తండ్రి లాగే మంచి ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. అతను మంచి పనులు చేస్తాడు. అందుకే దుబాయ్ ఎన్నో విషయాల్లో ముందుకు దూసుకుపోతోంది అని యూజర్లు కామెంట్లు పెడుతున్నారు. మరొక వ్యక్తి ఒక అద్భుతమైన రాయల్ ఫ్యామిలీ.. వారందరికీ దీర్ఘాయువు కలిగించాలని దేవుడు ప్రార్థిస్తున్నానని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
అయితే షేక్ హమ్దామ్ తో పాటు అతని మరో సోదరుడు కూడా ఇలా మంచి పనులే చేస్తూ ఉంటారని ప్రజలకు ఎంతో సహాయం చేశారని కామెంట్ కూడా పెట్టారు. అందుకే ఎంతోమంది హృదయాలు గెలుచుకున్నారని అన్నారు. ఇక 2008లో ఈ దుబాయ్ ప్రిన్స్ కిరీటం దక్కించుకున్నారు. అంతకుముందు 2006 నుంచి 2008 వరకు ఆయన డిప్యూటీ రూలర్ గా పని చేశారు. దుబాయ్ పర్యావరణ పరిరక్షణలో కూడా అయిన కీలక పాత్ర పోషిస్తాడు. అతని ఇంస్టాగ్రామ్ లో 17 మిలియన్ల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.