)
Ella bus accident Bus falls into deep vally 15 dead: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిలోని 24వ కి.మీ పోస్ట్ సమీపంలో నిన్న రాత్రి ఘెర రోడ్డు ప్రమాదం సంభవించింది. 30 మందితో ప్రయాణిస్తున్న బస్సు ఏకంగా వెయ్యి అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ క్రమంలో బాధితులంతా ఆర్తనాదాలు చేశారు.
Tragedy ?
3 persons reported dead & 12 others injured among those in the bus that toppled down a precipice near the 24th km post on the Ella-Wellawaya main road.
The injured admitted to the Badulla Teaching Hospital.Personnel from the police, Special Task Force, army and air… pic.twitter.com/9ijck8Dgmb
— Sri Lanka Tweet ?? (@SriLankaTweet) September 4, 2025
ఒకవైపు రాత్రి కావడం, మరోవైపు లోతైనలోయలో బస్సు పడిపోవడంతోసహయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. బాధితులు పోలీసులకు, అంబులెన్స్ లకు సాయం కోసం ఫోన్ లు చేశారు. అయిన కూడా పోలీసులు స్థానికులు, సిబ్బందితో అనేక మందిని కాపాడారు. దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు తమతో ఆనందంగా ఉన్న వారు ఒక్కసారిగా విగత జీవులుగా మారడం చూసి అక్కడి వారు కన్నీరు మున్నీరౌతున్నారు. తంగల్లె ప్రాంతంలో విహరయాత్రను ముగించుని తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్తుండగా ఈ పెను విషాదం సంభవించింది.
విహారయాత్రకు వెళ్లిన వారిలో తొమ్మిది మంది మహిళలు సహా కనీసం పదిహేను మంది మరణించారని అధికారులు వెల్లడించారు. 18 మందిలో - 11 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, పిల్లలు సహా - గాయపడ్డారని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆస్పత్రులన్ని బాధితుల రోదనలతో మిన్నంటాయి. ఈ ఘటనకు ముందు బాధితులు ఎంతో ఉల్లాసంగా దిగిన ఫోటోలు వెలుగులోకి వస్తున్నాయి. లోయలో పడిపోయిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు బైటపడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.