)
Nepal Latest Political Update: నేపాల్ లో జరుగుతున్న అల్లర్లను అదనుగా చేసుకుని దేశంలోని ఆయా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకుంటున్నారు. అలా మొత్తం ఏడు వేల మంది వరకు ఖైదీలు జైళ్ల నుంచి అదను చూసుకొని జంప్ అయ్యారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఐదుగురు మైనర్లు మృతి చెందారని తెలుస్తోంది. .నిరసనలను ఆసరాగా చేసుకుని ఖైదీలు జైళ్ల నుంచి తప్పించుకోవడానికి ప్రత్నించారని నేపాల్ మీడియా కథనాలు వెలువరించాయి. జైళ్లలో నిప్పు పెట్టి భద్రతా సిబ్బందిని భయపెట్టి పరారవుతున్నారని పలు మీడియా కథనాలు ఇస్తోంది. అలా దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల నుంచి దాదాపు 7,000 మంది ఖైదీలు తప్పించుకున్నారని సమాచారం. రాజ్‌బిరాజ్, ఝుంప్కా, దిల్లీబజార్, చిట్వాన్, నక్కూ, కైలాలీ, జాలేశ్వర్ తదితర జైళ్ల నుంచి వేల మంది తప్పించుకున్నారని తెలుస్తోంది. నౌబస్తా బాలసదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారని సమాచారం. ఈ పరిణామాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఖైదీల నుంచి ప్రాణభయంతో అనేక మంది బాధితులు తమ ఇళ్లు వీడి వేరే సేఫ్ ప్లేస్‌కు వెళుతున్నారని నేపాల్ మీడియా చెబుతోంది.
ఇక భద్రతా సిబ్బంది ఖైదీల నుంచి ఆయుధాలు లాక్కుని తప్పించుకునేందుకు ప్రయత్నించారని స్థానిక మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఐదుగురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారంటోంది. ఇక సింధూలిగఢీ జైల్లో ఖైదీలు నిప్పు పెట్టారని, అనంతరం అక్కడి నుంచి 43 మంది మహిళలు సహా మొత్తం 471 మంది తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. నవాల్‌పరాసీ వెస్ట్ జిల్లా జైలు నుంచి 500 మంది పరారయ్యారంటున్నారు. భారత్- నేపాల్ సరిహద్దులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లాలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఖైదీలను సశస్త్ర సీమాబల్ అదుపులోకి తీసుకుంది.
ఉద్రిక్తతల నేపథ్యంలో కాఠ్మాండూలోని త్రిభువన్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ ను మళ్ళీ రీ ఓపెన్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి కార్యకలాపాలను మళ్లీ ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు నేపాల్ ఆర్మీ శ్రమిస్తోంది. మరోవైపు, దేశంలో రాజ్యాంగాన్ని తిరిగిరాయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను దేశాధ్యక్షుడి ముందు ఆందోళనకారులు ఉంచనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నేపాల్‌లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు ముగ్గురు పోలీసులు సహా 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 715 మంది గాయాలపాలైనట్లు తెలిపారు. ఆందోళనల్లో గాయపడిన నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.