First coronavirus case in Cook Islands: ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్, రెండో వేవ్‌లను చవిచూశాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ భయాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ప్రపంచమంతా ఇలా థర్డ్ వేవ్ (Covid 19 third wave) పట్ల ఆందోళన చెందుతున్న వేళ... ఓ దేశంలో మాత్రం ఇటీవలే మొదటి కరోనా కేసు నమోదవడం గమనార్హం. సౌత్ పసిఫిక్ దేశమైన కుక్ దీవుల్లో (Cook Islands) గత గురువారం మొదటి  కరోనా పాజిటివ్ కేసును గుర్తించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశాల నుంచి తిరిగొచ్చిన 10 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా (Covid 19) నిర్దారణ అయినట్లు కుక్ దీవుల (Cook Islands) ప్రధాని మార్క్ బ్రౌన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ బాలుడు క్వారెంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. బహుశా ఆ కుటుంబం న్యూజిలాండ్ (Newzealand) నుంచి తిరిగొచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం దేశ సరిహద్దులను రీఓపెన్ చేసేందుకు సన్నద్దమవుతున్నామని పేర్కొన్నారు. ఆ బాలుడు తమ దేశంలో అడుగుపెట్టిన వెంటనే అతనికి కరోనా టెస్టులు చేయడం, పాజిటివ్‌గా తేలిన వెంటనే క్వారెంటైన్‌కు తరలించడం.. ఇవన్నీ కరోనా పట్ల తమ సన్నద్దతను తెలియజేస్తున్నాయని అన్నారు.


ప్రపంచ దేశాలన్నీ దాదాపు రెండేళ్లుగా కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ (Coronavirus) బయటపడిన కొత్తలోనే కుక్ దీవుల్లోకి విదేశీయుల రాకపోకలపై నిషేధం విధించారు. ఈ దీవుల్లో ఉండే మొత్తం జనాభా దాదాపు 17వేలు. దాదాపు 96 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విదేశీయుల రాకపోకలకు అనుమతించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే కరోనా మొదటి కేసు నమోదవడం ఆ దేశస్తులను కొంత ఆందోళనకు గురిచేస్తోంది.


Also Read: Omicron scare: 'వ్యాక్సిన్ వేసుకోకుంటే.. రేషన్ షాప్​ల నుంచి మాల్స్​ వరకు నో ఎంట్రీ'!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook