Mehul Choksi Arrested : ఎట్టకేలకు భారత ఆర్ధిక నేరస్తుడు మోహుల్ ఛోక్సీ అరెస్ట్..

Mehul Choksi Arrested :పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వేల కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని ఎట్టకేలకు బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 03:15 PM IST
Mehul Choksi Arrested : ఎట్టకేలకు భారత ఆర్ధిక నేరస్తుడు మోహుల్ ఛోక్సీ అరెస్ట్..

Mehul Choksi Arrested :రూ. 13 వేల 500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌ ఛోక్సీపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేయగా ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. నేరస్తులు పరస్పరం అప్పగించే ఒప్పందంలో భాగంగా బెల్జియం దేశం అతన్ని భారత్ కు త్వరలోనే అప్పగించనుంది.
గత శనివారమే ఛోక్సీని అరెస్టు చేయగా.. ప్రస్తుతం అతడు జైల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అనారోగ్య కారణాల రీత్యా అతడు వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు ఛోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. ఇటీవలే 26/11 దాడుల కుట్రదారు తహవ్వుర్‌ రాణాను భారత్‌ అమెరికా నుంచి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల వేళ ఛోక్సీ అరెస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Add Zee News as a Preferred Source

పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.

2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోడీలు దేశం విడిచి పారిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News