Golconda Blue Daimond: గోల్కొండ అనే పేరు గొల్ల కొండ నుంచి గోల్కండగా మారింది. కాకతీయులు కట్టించిన ఈ కోట.. ఆ తర్వాత ఖుతుబ్ షాహీల పరం అయింది. ఇక్కడ ఎన్నో వజ్రాలు, వైడూర్యాలలకు నిలయంగా మారింది. గోల్కండ పక్కన మణిల కొండ ఉండేది. కాల క్రమేణా ఆ పేరు పేరు మణికొండగా స్థిర పడింది. తాజాగా ఈ గోల్కండ బ్లూ డైమండ్ ఇక్కడే దొరకింది. ఆ తర్వాత ఇండోర్, బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ఈ వజ్రం ప్రపంచంలోనే అరుదైనదిగా నిలిచింది.
మే 14న జెనీవాలోని క్రిస్టిన్ సంస్థ ఈ గోల్కండ బ్లూ డైమండ్ ను వేలం వేయనుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం ధర రూ. 300 నుంచి రూ. 430 కోట్ల రూపాయల వరకు పలకొచ్చుని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉంది. తొలుత ఇండోర్ రాజవంశ వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ వజ్రం 1947లో న్యూయార్క్‌కు చెందిన నగల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్ కొనుగోలు చేశారు.
ఆ తర్వాత ఈ వజ్రం బరోడా మహారాజు వద్దకు చేరింది. అనంతరం ఓ ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వజ్రం వేలానికి రావడంతో ప్రపంచంలోని బిలియనీర్లు సొంతం చేసుకునేందుకు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









