What Is H1B H4 Visa Vetting: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక మార్పులు, మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రధానంగా అమెరికాకు ఎక్కువగా వలసలు రావడంతో దానిని నిరోధించడానికి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు నుంచి H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయనుంది. ఈ ప్రక్రియనే వెట్టింగ్ అని పిలుస్తారు. అంటే దరఖాస్తుదారలు సోషల్ మీడియా సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్ గా మార్చుకోవాలి. ఈ నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ కోణంలోనే ఉంటుందని యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించరని మేం నమ్మాలి అని పేర్కొంది.
సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి..?
సోషల్ మీడియా వెట్టింగ్ అంటే.. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లే వ్యక్తులు, ప్రధానంగా స్టూడెంట్స్, ఉద్యోగులు తమ ఎఫ్‌బీ, ఎక్స్, ఇన్స్టా, లింక్డిన్ తదితర సోషల్ మీడియా అకౌంట్ పోస్టులను, కామెంట్లను యూఎస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ మీరు గతంలో డిలీట్ చేసినా గానీ పట్టేస్తారు. ప్రధానంగా జాత్యాహంకార, లైంగిక, హింసాత్మక ,చట్టవిరుద్ధ వ్యాఖ్యలు, యుఎస్ కు వ్యతిరేక ఆలోచనలు చేసిన వారి వీసా రిజెక్ట్ చేస్తారు. దీని కోసమే వెట్టింగ్ విధానం ఎంచుకుంది.
ఇమ్మిగ్రేషన్ మరింత కఠినతరం..
ట్రంప్ పాలన కారణంగా ఇమ్మిగ్రేషన్ లో మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కేవలం నైపుణ్యం కలిగిన వ్యక్తులు, వారి కుటుంబాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటున్నారు. H1B, H4 ( డిపెండెంట్) వీసా ఆన్‌లైన్ సోషల్ మీడియా ప్రొఫైల్ ను తనిఖీ చేయనున్నారు. J1,B1 ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి.
భారత్‌పై ప్రభావం..
ప్రధానంగా యుఎస్ వచ్చే H1B వీసాదారులు భారత్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక అమెరికా చేపట్టిన ఈ వెట్టింగ్ విధానంలో తీవ్ర ప్రభావం చూపేది భారతీయులపైనే. అమెరికన్ టెక్ కంపెనీలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు నిపుణులను నియమించుకుంటాయి. ఈ వెట్టింగ్ ప్రక్రియల వల్ల H1B వీసా దరఖాస్తుదారులుకు ఇంటర్వ్యూ కూడా ఆలస్యం అవ్వచ్చు.
ఇక భారత్ నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే H1B, H4 వీసాదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రైవేట్ గా కాకుండా పబ్లిక్ గా ఉంచడం మంచిది. ప్రొఫెషనల్‌గా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఈ సోషల్ మీడియా ప్రొఫైల్ వెరిఫికేషన్ డిసెంబర్ 15వ తేదీ నుంచి నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ప్రధానంగా ట్రంపు ప్రభుత్వం అన్ని రాయబార కేంద్రాలకు ఆదేశాలు దీనికి సంబంధించి జారీ చేసింది. ఇప్పటికే F1, J1 స్టడీ వీసాలతో పాటు B1, B2 విజిటర్ వీసాలు కూడా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లు పబ్లిక్ గా ఉంచాలని కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: Video: రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి ఉగ్రవాది నుంచి గన్ లాక్కొని గురిపెట్టిన అహ్మద్ వైరల్ వీడియో..
ఇదీ చదవండి: రూ.100 కోట్ల జెట్ ఉన్న మెస్సీ.. ఏడాది సంపాదన ఎన్ని వేల కోట్లు తెలిస్తే కళ్లు బైర్లుకమ్ముతాయి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









