Israeli Hostages: ఇజ్రాయెల్‎కు హమాస్ మాస్ వార్నింగ్.. దాడులు ఆపకుంటే బందీలంతా శవపేటికల్లో తిరిగి వస్తారు

Israeli Hostages:  ఇజ్రాయెల్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది హమాస్. దాడులు ఆపకుంటే బందీలంతా శవపేటికలో తిరిగి వస్తారంటూ హెచ్చరించింది. బందీలను సురక్షితంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటే..ఇజ్రాయెల్ దాడులు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని హమాస్ తెలిపింది.   

Written by - Bhoomi | Last Updated : Mar 27, 2025, 07:36 AM IST
 Israeli Hostages: ఇజ్రాయెల్‎కు హమాస్ మాస్ వార్నింగ్.. దాడులు ఆపకుంటే బందీలంతా శవపేటికల్లో  తిరిగి వస్తారు

Israeli Hostages: ఇజ్రాయెల్ తన దాడులను మళ్లీ ప్రారంభించింది. గాజాలో మళ్లీ నెత్తటి ప్రవాహం పారుతోంది. భీకరదాడుల్లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కు హమాస్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. దాడులను ఇలాగే కొనసాగించినట్లయితే సైన్యం సాయంతో బందీలను తరలించేందుకు ప్రయత్నిస్తే..వారు శవపేటికల్లో తిరిగివస్తారని తెలిపింది. మరోవైపు గాజా సిటీలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ స్థానికులను ఐడీఎఫ్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 

Add Zee News as a Preferred Source

బందీలను సజీవంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆపడం లేదు. వారు చేపడుతున్న దాడులతో వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. సైన్యం సాయంతో బందీలను విడిపించుకోవాలని ప్రయత్నిస్తే..వారు శవపేటికల్లో తిరిగివస్తారని హమాస్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు గాజాపై టెల్ అవీవ్ తన దాడులను మరింత విస్త్రుతం చేస్తోంది. గాజా సిటీలోని జీటౌన్ టెల్ అల్ హవా వంటి ప్రాంతాల పౌరులు తమ నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రమూకలు చేపట్టిన రాకెట్ దాడులకు త్వరలోనే సమాధానం చెబుతామని తెలిపింది. 

Also Read: Kamindu Mendis SRH 2025: దటీజ్ కమిందు.. రెండు చేతుల్తో ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం అతనికే సాధ్యం  

మిగతా 59 మంది బందీలను అప్పగించేంత వరకు హమాస్ పై సైనికపరంగా ఒత్తిడి పెంచుతామని నెతన్యాహు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకు గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలిగేవరకు బందీలను విడుదల చేయబోమని హమాస్ అంటోంది. ఇటీవల ఇజ్రాయెల్ మరోసారి ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 830 మంది మరణించారు. ఈ పరిణామాల నడుమే హమాస్ కు వ్యతిరేకంగా స్థానికంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News