Hassan Nasrallah: హిజ్బుల్లా మాజీ అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు ఆయన మద్దతుదారులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. గత ఏడాది సెప్టెంబరులో ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన దాదాపు 5 నెలలకు లెబనాన్ రాజధాని బీరూట్ లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సస్రల్లా బంధువు, హిజ్బుల్లా వారసుడిగా భావించిన హషీమ్ సఫీద్దీన్ కూ తుది విడ్కోలు పలకనున్నారు. ఇరువురికి నివాళులర్పించేందుకు వచ్చిన వేలాది మందితో బీరూట్ లోని స్టేడియం కిక్కిరిసిపోయింద.
గత ఏడాది సెప్టెంబర్ లో బీరూట్ దాహియా ప్రాంతంలోని హిజ్బుల్లా కేంద్ర కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లోనే నస్రల్లాతోపాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళానికి చెందిన డిప్యూటీ కమాండ్ జనరల్ అబ్బాస్ నీలోఫరసన్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని రోజులకు మరో దాడిలో సఫీద్దీన్ కూడా మరణించారు. అప్పట్లో ఇద్దరిని తాత్కాలికంగా రహస్య ప్రదేశాల్లో ఖననం చేశారు. వారికి అధికారిక అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ ఇటీవల హిజ్బుల్లా ప్రకటించింది. ఈ క్రమంలోనే బీరూట్ లో నస్రల్లాను సపీద్దీన్ ను దక్షిణ లెబనాన్ లోని ఆయన స్వస్థలంలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రజల సందర్శనార్థం ఆదివారం వారి శవపేటికలను బీరూట్ లోని స్టేడియానికి తరలించింది.
ఈ కార్యక్రమానికి 65దేశాల నుంచి 800 మంది ప్రముఖులు వచ్చినట్లు హిజ్బుల్లా వర్గాలు తెలిపాయి. ఇరాన్ నుంచి పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఖాలిబఫ్, విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హాజరయ్యారు. అంత్యక్రియల సమయంలో బీరూట్ గగనతలంపై తమ యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతుండటంపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కాట్జ్ స్పందించారు. తమ దేశం జోలికి వస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సందేశాన్ని చాటుతున్నట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









