Helicapter Crash in US: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. గింగిరాలు ఎలా తిరిగిందో చూడండి..

Helicapter Crash in US: అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో టెక్‌ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం చెందారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2025, 08:05 PM IST
Helicapter Crash in US: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్.. గింగిరాలు ఎలా తిరిగిందో చూడండి..

Helicapter Crash in US: అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌ కంపెనీ స్పెయిన్‌ ఓనర్‌   అగస్టన్‌ ఎస్కోబార్‌ తన కుటుంబంతో  కలిసి న్యూయార్క్‌  పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ హడ్సన్‌ నది మీదుగా వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది.

Add Zee News as a Preferred Source

గింగిరాలు తిరుగుతూ నదిలో తలకిందులుగా పడిపోయింది. అనంతరం మంటలు చెలరేగడంతో హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఎస్కోబార్‌, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు పైలట్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బెల్‌ 206 చాపర్‌ను న్యూయార్క్‌ హెలికాప్టర్‌ టూర్స్‌ విభాగం సైట్‌ సీయింగ్‌ కోసం వినియోగిస్తోంది.

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలంలో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్‌ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్‌లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు.  ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News