)
Helicopter Crash Video: ఫ్రాన్స్‌లోని రోస్పార్డెన్ అనే ప్రాంతంలో ఓ హెలికాప్టర్ సరస్సులో పడిన ఘటన చోటు చేసుకుంది. అడవిలో మంటలను అదుపు చేయడానికి ఒక సరస్సు నుంచి హెలికాప్టర్ ద్వారా నీటిని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బకెట్ తో వాటర్ తోడే క్రమంలో హెలికాప్టర్ అదుపుతప్పి అదే నీటిలో పడిపోయింది. వేగంగా రెండు రౌండ్లు తిరిగి మరి అందులోనే పడిపోయింది. పైలట్, ఫైర్ సిబ్బంది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చి క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అంతకుముందు 27 సార్లు నీటి నీటిని తరలించిన హెలికాప్టర్ ఆ తర్వాత అదుపుతప్పి కుప్పకూలిపోయింది.
అయితే ఈ ఘటన ఆగస్టు 24వ తేదీ ఆదివారం చోటు చేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం 7:00 తర్వాత సరస్సులో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. హెలికాప్టర్ పైలెట్ సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షి కూడా చెప్పారు. అయితే లియాన్ సమీపంలోని ఒక పెద్ద అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను అదుపు చేయడానికి హెలికాప్టర్ ద్వారా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అంతకు ముందు వరకు 27 సార్లు నీటిని తీసుకొని వెళ్లి మంటలను ఆర్పిన ప్రయత్నాలు చేసిన హెలికాప్టర్ లోని సిబ్బంది 28వ సారి అదుపుతప్పి అదే నీటిలో పడిపోయారు.
ఒక్కసారిగా అదుపు తప్పడంతో నీటి ఉపరితలం తాకిన తర్వాత హెలికాప్టర్ అకస్మాత్తుగా రెండుసార్లు గిర్రును తిరిగి అదుపుతప్పి పడిపోయింది. సెకండ్లలో సరస్సులో మునిగిపోయింది. ఇది ప్రత్యక్షంగా ఉన్న చాలామంది చూసి ఒక్కసారిగా భయాందోళనకు కూడా గురయ్యారు. అయితే ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఆ హెలికాప్టర్ నీళ్లను తోడే క్రమంలో దాని వెనుక భాగం నీటిలో ముందుగా చిక్కుకుని ఆ తర్వాత దాని పైకి లేపే క్రమంలో అదుపుతప్పి గిరగిరా తిరిగి పడిపోయింది. చుట్టూ పెద్ద ఎత్తున అలలు కూడా ఉన్నాయి. అయితే ఇక హెలికాప్టర్ కూడా చెల్లా చెదురుగా పడిపోయిందని చెప్పారు.
అయితే ఫ్రాన్స్ లియాన్ ప్రాంతంలో అడవిలో కార్చిచ్చురేగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించి 13 మంది గాయపడ్డారు. అందులో 11 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఈ మంటలు ఆర్పే సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.