)
Hong kong Fire Reason: హాంకాంగ్ అపార్ట్మెంట్లో ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. ఈ 32 అంతస్థుల స్కై స్క్రాపర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు వందలాది మంది కూడా ఆచూకీ తెలియడం లేదు. ఈ ప్రమాదం వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని, పోలీసులు విచారిస్తున్నారు. ప్రమాదం సమయానికి ముందు బిల్డింగ్ నుంచి భారీ శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. వెదురు చెక్కల నుంచి మంటలు వచ్చినట్లు ఏఎఫ్‌బీ రిపోర్టర్ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద కుట్ర కోణంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
హాంకాంగ్‌లోని స్కై స్క్రాపర్ లో ఘోర అగ్నిప్రమాదం జరగడంతో నిన్న పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగిన సంగతి తెలిసిందే. ఫైనాన్షియల్ హబ్‌గా పేరు పొందిన ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తై పో కోర్టు కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ భవంతిలో రెండు వేల ఫ్లాట్స్ ఉన్నట్లు సమాచారం. 32 అంతస్తుల ఈ భవంతిలో వందలాదిమంది నివాసం ఉంటున్నారు. అగ్ని ప్రమాదం సమయంలో చాలామంది చిక్కుకున్నారు. ఇప్పటికి 44 మంది దుర్మరణం చెందగా వందలాది మంది ఆచూకీ తెలియడం లేదని సమాచారం.
Three men arrested for manslaughter after NIGHTMARE Hong Kong fire
At least 40 people now dead, nearly 300 missing
City officials still haven’t commented on the cause of the blaze https://t.co/YoP9MNDj5k pic.twitter.com/CqdsJyZJMO
— RT (@RT_com) November 26, 2025
ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం మేరకు అపార్ట్మెంట్లో మంటలు చెలరేగే ముందు భారీ ఎత్తున శబ్దాలు కూడా వినిపించినట్లు సమాచారం. ఆ తర్వాత దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. శిథిలాల కింద ఇప్పటికి చిక్కుకొని ఉన్నట్లు కూడా సమాచారం. సహాయక చర్యలు నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలు తొలగించి రక్షణ చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ అంటుకున్న సమయంలో కూడా చాలా మందికి తెలియక ఇళ్లలోనే కిటికీలు సైతం మూసి ఉన్నారని 60 ఏళ్ల వృద్ధుడు తెలిపాడు.. ఆయన గత 40 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే అక్కడ గాలులు కూడా పెద్ద ఎత్తున రావడంతో మంటలు మరింత పెరిగాయి. ఫ్లోర్ అంతా పూర్తిగా కాలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది.
ఈ ప్రమాదంలో 37 ఏళ్ల ఓ ఫైర్ ఫైటర్ కూడా చనిపోయినట్లు సమాచారం. ఇప్పటికే 900 మందికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి భవంతిలోని నివాసితులను అక్కడికి చేర్చారు. 279 మందిని ఫైర్ ఫైటర్స్ కాపాడారని హాంకాంగ్ లీడర్ జాన్ లీ తెలిపారు. అయితే ఈ మంటలను నేపథ్యంలో ఇప్పటికే అంతా ఖాళీ బూడిద అయిపోయాయి.. కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అని స్థానికులు వాపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.