)
Imran Khan Murder Rumours In Adiala Jail: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో చంపేశారా? అతని అత్యంత దారుణంగా చంపేశారు అనే ఆరోపణలు బయటికి వస్తున్నాయి. అయితే ఈ వార్త విన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతు దారులు పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులతో అతన్ని కలవడానికి వెళ్లారు. అయితే జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను కలవకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున జైలు బయటి ఆందోళనకు దిగారు. తన సోదరీమణులను కలవనివ్వడంలేదు ఇమ్రాన్‌ను చంపేశారని లేకపోతే ఎలాగైనా చూపించాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి జైల్లోనే ఉన్నారు ఇమ్రాన్. ఇటీవల అనేకసార్లు తన భార్యను వేధిస్తున్నారని కూడా ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ ప్రధాని చనిపోయారని ఆరోపణలు వ్యాపిస్తున్నాయి. అడియాల జైలు బయట పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో విష ప్రయోగం చేసి చంపేశారని చెబుతున్నారు. అయితే దీన్ని ఇంకా అధికారికంగా పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కేవలం ఇది పుకారే అని కొట్టిపారేసింది. అయితే కోర్టు అనుమతి పొందిన కానీ ఇమ్రాన్ ఖాన్ ను కలవకుండా చేస్తుండటంతో ఈ ముగ్గురు సోదరీమణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది ఇమ్రాన్ ఖాన్ ఒక రహస్య జైల్లో పెట్టారని ..అతని ఆరోగ్యం బాగోలేదని అందుకే కుటుంబాన్ని కలవనివ్వడం లేదని చెప్తున్నారు. ఇమ్రాన్‌కు చెవికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఇది చెవిలో క్రమంగా వినికిడి కోల్పోవడం దీనికి చికిత్స పొందారు. అయితే నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, ఐఎస్ఐ ఆదేశాలతో జైల్లోనే చంపేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇదివరకు కూడా ఇలాగే ఇమ్రాన్ ఖాన్‌ను 2025 మేలో జైలులో కాల్చి చంపేశారు అనే ఆరోపణలు బయటికి వచ్చాయి. ఈ మాజీ ప్రధానమంత్రి 2023 ఆగస్టు నుంచి రావల్పిండి అడియాల జైల్లో ఉంటున్నారు. ప్రధానంగా అల్ ఖాదీర్ ట్రస్ట్ కు సంబంధించిన అవినీతికి పాల్పడ్డారని ఆయనను జైల్లో వేశారు. ఆయనతోపాటు అయిన భార్య బుష్రా బీబీ ని కూడా అరెస్టు చేశారు. అయితే 2025 జనవరిలో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇమ్రాన్‌పై మరిన్ని కేసులు కూడా ఉన్నాయి. మాజీ ప్రధాని మాత్రమే కాదు ఇమ్రాన్ ఖాన్ ఒక మాజీ క్రికెటర్ కూడా. ఆయన ప్రధానంగా ఒక ట్రస్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి