)
Imran Khan On Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ పై సంచలన ఆరోపణలు చేశారు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అతని మానసిక స్థితి సరిగ్గా ఉండదు.. అందుకే అధికారం కోసం అతను దేనికైనా తెగిస్తాడని ఆరోపణలు చేశాడు. తన భార్య బుష్రా బీబీని కూడా ఒంటరిగా ఉంచి మానసికంగా హింసిస్తున్నాడు. బానిసత్వం కంటే తమకు చావే మంచిదని కోరుకుంటున్నాం. ఎప్పటికీ అతని ముందు తలవంచం మమ్మల్ని మేము సరెండర్ చేయమని తెలిపారు. ఇక 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉంటున్నారు. ఈ సంచలన ఆరోపణలు ఆసిఫ్ మునీర్ పై చేశారు ఇమ్రాన్ ఖాన్.
మొదటి నుంచే మునీర్ తమను వేధిస్తున్నాడని ఎక్స్ వేదికగా ఒక పోస్టు ప్రచురితమైంది. అంతేకాదు మునీర్ పాలనల దారుణాలు జరుగుతున్నాయి. తనను మాత్రమే కాదు తన భార్యను కూడా ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ వాపోయారు. ఒక రాజకీయ నాయకుడి కుటుంబమే ఇతని క్రూరత్వాన్ని ఎదుర్కోలేక పోతుంది అని ఆయన అన్నారు. ఎప్పటికీ రాజీ పడే ఆలోచన లేదని కూడా చెప్పారు. ప్రభుత్వం ఒక కీలుబొమ్మ అని కూడా ఈ మాజీ ప్రధాని అన్నారు.
అయితే అసిమ్ మునీర్ తన పదవిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు.. ఒక వ్యక్తి పైనే మొత్తం ప్రభుత్వ అధికారం నడుస్తుంది. ఏ చట్టపరమైన చర్యలు అయినా ప్రస్తుతం పాక్‌లో ఆలస్యంగా జరుగుతున్నాయి. తమపై వేసిన కేసులు నిరాధారం. ఎప్పటికీ నిలబడవు అని కూడా ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశాడు. తమ పార్టీపై కూడా క్రూరమైన చర్యలు చేపడుతున్నారు. పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడం అనాగరిక చర్య. ఎప్పటికీ ఊహించలేని దారుణమని కూడా ఆయన అన్నారు. మహిళలపై కూడా దారుణంగా దాడులు జరుపుతున్నారు.
పాకిస్తాన్ చరిత్రలో ఏ నాయకుడి కుటుంబం కూడా ఇలాంటి దారుణమైన బానిసత్వాన్ని ఎదుర్కోలేదు. ఎవ్వరేం చేసినా ఎప్పటికీ తాము తలవంచబోమాని కూడా ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. తమపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టి.. వాటిలో జాప్యం జరుపుతున్నారని కూడా చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.