India - Pak: పాకిస్థాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తూ, ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్థాన్ కు భారత్ భారీ జట్కా ఇచ్చింది. పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలంపై రాకపోకలను ఈనెల 23 వరకు నిషేధం విధించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని వెల్లడించింది.
పాకిస్థాన్ కు చెందిన ప్రయాణికుల విమానాలతోపాటు మిలిటరీ విమానాలకూ ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు పాకిస్థాన్ కు చెందిన ఎయిర్ లైన్స్ లేదా ఆపరేటర్లు నడిపే లేదా లీజుకు తీసుకున్న విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. దీంతో పాక్ విమానాలు శ్రీలంక లేదా చైనా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
మొత్తంగా పహల్గామ్ దాడి తర్వాత ముందుగా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. మరోవైపు మన దేశంలో ఉన్న పాకిస్థానీ జాతీయులను వెంటనే మన దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. ఇప్పటికే మన దేశం నుంచి 900 మంది పాకిస్థానీ జాతీయులను అట్టారీ - వాఘా సరిహద్దు గుండా వారి దేశంలోకి డిపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం దేశంలో పాకిస్థానీలు అక్రమంగా పట్టుబడితే వారికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించనుంది.
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









